యాప్నగరం

Kerala: కోళ్ల కోసం వచ్చి.. బావిలో పడిన ఎలుగుబంటి.. ఆఖరికి..

Kerala: సమయం.. అర్ధరాత్రి 12 గంటలు. ఆకలితో ఉన్న ఓ ఎలుగుబంటి.. అడవి నుంచి సమీపంలోని గ్రామానికి వచ్చింది. ఓ ఇంటి దగ్గరికి వెళ్లింది. అక్కడ దానికి కోళ్లు కనిపించాయి. వెంటనే వాటిపై దాడి చేసింది. రెండు కోళ్లను తినేసింది. అయినా ఆకలి తీరలేదు. మూడో కోడి కోసం వేట ప్రారంభించింది. ఆ సమయంలో అనుకోకుండా బావిలో పడిపోయింది. పైకి ఎక్కలేక పోయింది. దాన్ని బయటకు తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 20 Apr 2023, 8:55 pm

ప్రధానాంశాలు:

  • కేరళలో బావిలో పడిపోయిన ఎలుగుబంటి
  • కోళ్ల కోసం వచ్చి బావిలో పడిన ఎలుగుబంటి
  • బయటకు తీసేలోపే ప్రాణం వదిలిన ఎలుగుబంటి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bear falling into a well
బావిలో పడిపోయిన ఎలుగుబంటి
Kerala: కేరళ రాష్ట్రం వెల్లనాడ్‌లో బావిలో పడిపోయిన ఎలుగుబంటి కథ విషాదాంతం అయ్యింది. బావిలో ఉన్న ఎలుగుబంటికి అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎలుగుబంటిని బయటకు తీసుకొచ్చినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఎలుగుబంటికి అటవీశాఖ అధికారులు మత్తు మందు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మత్తు మందు ఇచ్చాక చాలాసేపు నీటిలో ఉన్న కారణంగా bear చనిపోయిందని తెలుస్తోంది.
బుధవారం రాత్రి కన్నంపల్లికి చెందిన ప్రభాకరన్‌ అనే వ్యక్తి బావిలో ఎలుగుబంటి పడింది. ప్రభాకరన్ ఇంటి దగ్గర కోళ్లు ఉన్నాయి. ఎలుగుబంటి వాటిని పట్టుకునేందుకు వచ్చి.. బావిలో పడింది. ఎలుగుబంటి రెండు కోళ్లను పట్టుకుని తిన్న తర్వాత.. మూడో కోడిని పట్టుకునే ప్రయత్నంలో బావిలో పడిపోయింది. శబ్దం విని బయటకు వచ్చిన కుటుంబీకులు ఎలుగుబంటిని చూశారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
తిరువనంతపురం జూకు చెందిన వైద్యుడు అలెగ్జాండర్ జాకబ్ నేతృత్వంలో.. ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చారు. ఎలుగుబంటి చాలా సేపటి క్రితం బావిలో పడిపోయిన కారణంగా బలహీనంగా ఉంది. అప్పుడు దాన్ని మామూలుగా బయటకు తీస్తే.. దాడి చేస్తుందన్న భయంతో మత్తు మందు ఇచ్చారు. మత్తు మందు ఇచ్చాక ఎలుగుబంటి స్పృహ కోల్పోయి నీటిలో మునిగిపోయింది. అటవీ శాఖ అధికారులు బావిలోకి దిగి తీసే ప్రయత్నం చేసినా.. అప్పటికే ఆలస్యం అయ్యింది. దీంతో ఎలుగుబంటి చనిపోయింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.