యాప్నగరం

బీజేపీ పతనానికి ఇది ఆరంభం: మమతా బెనర్జీ

ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వెలువడిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరాజయంపాలైన సంగతి తెలిసిందే. బీజేపీ ఓటమిపై... పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందిస్తూ.... బీజేపీ పతనానికి ఇది ఆరంభమని అన్నారు.

TNN 14 Mar 2018, 5:25 pm
ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వెలువడిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరాజయం దిశగా సాగుతుంది. బీజేపీ పరిణామాలపై... పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందిస్తూ.... బీజేపీ పతనానికి ఇది ఆరంభమని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్, మాయవతి, లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆమె అభినందనలు తెలిపారు.
Samayam Telugu the beginning of the end has started mamata banerjee
బీజేపీ పతనానికి ఇది ఆరంభం: మమతా బెనర్జీ


ఉపఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఓటమి దిశగా సాగుతున్నారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ కంచుకోటైన గోరఖ్‌పూర్‌లో, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతనిధ్యం వహించిన ఫుల్ పూర్ లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లోని అరారియా లోక్ సభ స్థానంలో, జెహానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ విజయం సాధించింది.

గోరఖ్‌పూర్‌ నుంచి... ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఇదే లోక్‌స‌భ స్థానం నుంచి యోగి.. ఏకంగా 3 ల‌క్ష‌ల 12 వేల‌కుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. గ‌తేడాది సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి ఆయ‌న రాజీనామా చేశారు. కానీ నాలుగేళ్ల‌లోనే ప‌రిస్థితి పూర్తిగా తారుమారైంది. ఉపఎన్నికల్లో అటు స‌మాజ్‌వాదీ, బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ చేతులు క‌ల‌ప‌డం బీజేపీ కొంప ముంచింది.

Great victory. Congratulations to Mayawati Ji and @yadavakhilesh Ji for #UPByPolls The beginning of the end has started — Mamata Banerjee (@MamataOfficial) March 14, 2018 Congratulations to @laluprasadrjd Ji for winning #Araria and #Jehanabad This is a great victory — Mamata Banerjee (@MamataOfficial) March 14, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.