యాప్నగరం

నేను మాట్లాడితే.. భూకంపమే: రాహుల్

‘‘నే మాట్లాడితే.. భూకంపమే’’.. ఈ మాట అన్నది మరెవరో కాదు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

TNN 9 Dec 2016, 1:44 pm
న్యూఢిల్లీ: ‘‘నే మాట్లాడితే.. భూకంపమే’’.. ఈ మాట అన్నది మరెవరో కాదు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. నోట్ల రద్దుపై ప్రభుత్వం లోక్ సభలో చర్చ పెట్టకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నోట్ల రద్దుపై చర్చ పెట్టకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది. దీనిపై నాకు సభలో మాట్లాడే అవకాశమిస్తే నా ప్రసంగం భూకంపం సృష్టిస్తుంది’’ అని తెలిపారు.
Samayam Telugu there will be earthquake if i speak on demonetisation rahul
నేను మాట్లాడితే.. భూకంపమే: రాహుల్


నోట్ల రద్దు దేశంలో కెల్లా అతి పెద్ద కుంభకోణమని, దీనిపై తాను లోక్ సభలో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ తెలిపారు. కొత్త నోట్లు, చిన్న నోట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

త నెల రోజులుగా నోట్ల రద్దుపై చర్చకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నోట్ల రద్దుపై పార్లమెంటులో అడుగుతున్న ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పడం లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.