యాప్నగరం

పాడుబడ్డ బావిలో వేలాది ఆధార్‌ కార్డులు..!

మహారాష్ట్ర‌లో... ఒక పాడుబడ్డ బావిలో వేలాది ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు లభ్యమైన ఘటన కలకలం రేపింది. యవత్మల్‌లోని షిండేనగర్‌ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది.

TNN 15 Mar 2018, 12:54 pm
మహారాష్ట్ర‌లో... ఒక పాడుబడ్డ బావిలో వేలాది ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు లభ్యమైన ఘటన కలకలం రేపింది. యవత్మల్‌లోని షిండేనగర్‌ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. తాగునీటి కొరత ఉన్న నేప‌థ్యంలో స‌ద‌రు బావిని బాగు చేసుకోవాల‌ని ఆ గ్రామ యువ‌కులు నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యం గురించి తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్‌ రాజేశ్ దేశ్‌ముఖ్‌తో పాటు కొంతమంది ఎన్‌‌జీవోలు బావి నుంచి చెత్తను తొలగించేందుకు అక్క‌డికి వ‌చ్చారు. ఈ క్రమంలో వారికి వేలాది ఆధార్ కార్డులు బావిలో కనిపించాయి.
Samayam Telugu thousands of aadhaar cards found in maharashtra well
పాడుబడ్డ బావిలో వేలాది ఆధార్‌ కార్డులు..!


నైలాన్ గోనె సంచుల్లో ఆధార్ కార్డుల‌ను ప్యాక్ చేసి, వాటిని రాళ్ల‌తో కట్టి ఆ బావిలో పారేసిన‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు దర్యాప్తు కోసం ఓ కమిటినీ ఏర్పాటు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు ఆధార్ కార్డును బ్యాంకులతో అనుసందానం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటన బయటపడటం సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.