యాప్నగరం

ఆ రోజు ప్రధాని ప్రాణానికి ముప్పుందా?

ఆగష్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసి.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఉగ్రవాదుల..

TNN 29 Jul 2016, 10:01 am
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసి.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఎస్పీజీని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌‌ను అప్రమత్తం చేశాయి. ప్రాణహాని హెచ్చరికల నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ద్వారా ప్రసంగించాలని భద్రతా దళాలు మోదీని కోరాయి. గత రెండు పర్యాయాలు ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్ నుంచి కాకుండా సాధారణంగానే ప్రసంగించారు. ప్రధాని లక్ష్యంగా డ్రోన్లతో దాడులు జరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ దాడులు పెరుగుతుండటం కూడా ఈ హెచ్చరికలకు మరో ప్రధాన కారణం. అల్‌ఖైదా, ఐసిస్‌లు ఆర్మీ, పోలీసుల చెక్‌పోస్టులపై దాడులకు దిగే అవకాశం ఉందన్న సమచారం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు చేరింది. ఇందిరా గాంధీ హత్యకు గురైన నాటి నుంచి బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌‌క్లోజర్ ద్వారా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఆనవాయితీగా మారింది. కానీ 2014లో మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా ప్రసంగించారు. దీంతో ఆశ్చర్యానికి గురైన భద్రతా దళాలు.. ఎర్రకోటలోని నలువైపుల నుంచి స్పాటర్స్ ను వ్యూహాత్మకంగా ఉంచి ప్రధానికి భద్రతను కల్పించాయి. ఈ ఏడాది కూడా ప్రధాని అలాగే మాట్లాడే అవకాశం ఉందని భావించిన భద్రతా దళాలు అందుకు సన్నద్ధమయ్యాయి. కానీ ఐసిస్, అల్‌ఖైదా తదితర ఉగ్రవాద సంస్థలు ప్రధానిని టార్గెట్ చేశాయని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలతో బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్ నుంచి ప్రసగించాలని ప్రధానిని కోరుతున్నాయి.
Samayam Telugu threat to pm on independence day
ఆ రోజు ప్రధాని ప్రాణానికి ముప్పుందా?


This Independence Day, threat to PM’s life higher https://t.co/Op52Q5rt7C pic.twitter.com/zjmrMJDUAt — Times of India (@timesofindia) July 28, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.