యాప్నగరం

Uttar Pradesh: పడవ బోల్తా.. నీట మునిగిన 30 మంది.. ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) దైవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదం బారిన పడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న బోటు నదిలో బోల్తా పడింది. మొత్తం 30 మంది నీటిలో మునిగిపోగా.. ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 8 Nov 2022, 7:48 pm
ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఘోర ప్రమాదం సభవించింది. బారాబంకీలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ సుమ్లీ నదిలో బోల్తా పడిపోయింది. దాంతో 30 మంది నీటిలో మునిగిపోయారు. అయితే 20 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానిక అధికారులు ఏడుగురిని రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu Boat capsize in Sumli river


బైరానా మౌ మజారి గ్రామంలో నది ఒడ్డున ప్రతి ఏటా పౌర్ణమి రోజున గారంగ్‌ దేవ్‌ దగ్గర దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానిక ప్రజలు బయల్దేరారు. పడవలో సుమ్లీ నది దాటుతుండగా.. మధ్యకు రాగానే బోటు బ్యాలెన్స్ తప్పి బోల్తా పడింది. పడవలోని 30 మంది నీట మునిగిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మృతుల్లో రీతూ యాదవ్ (14), ప్రియాంక (6) హిమాన్షు (8) ఉన్నట్లు గుర్తించారు. వీరు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన పిల్లలుగా తెలుస్తుంది.

ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, జిలలా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. కాగా ఈ ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా స్పందించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. వారికి తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.