యాప్నగరం

మూడు రోజులు బ్యాంకులకు సెలవు

నెల ప్రారంభమై జీతాలు వచ్చినా, అవసరాలకు డబ్బు తీసుకునే అవకాశం లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవు దినాలు వస్తున్నాయి...

TNN 8 Dec 2016, 12:49 pm
పెద్ద నోట్లు రద్దు జరిగి నెల రోజులవుతున్నా ప్రజలకు నగదు కష్టాలు మాత్రం తీరడంలేదు. ఏటీఎంలలో పరిమితంగా నగదు తీసుకునే అవకాశం మాత్రమే ఉండటంతో రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల ప్రారంభమై జీతాలు వచ్చినా, అవసరాలకు డబ్బు తీసుకునే అవకాశం లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
Samayam Telugu three consecutive holidays days for banks in currency crisis
మూడు రోజులు బ్యాంకులకు సెలవు


కాగా.. ఇలాంటి సమయంలో బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవు దినాలు వస్తున్నాయి. డిసెంబర్ 10 రెండో శనివారం, 11న ఆదివారం, 12వ తేదీ సోమవారం ఈద్- ఎ- మిలద్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే పరిస్థితి లేకపోవడంతో నేడు, రేపు బ్యాంకులకు రద్దీ పెరగనుంది.

ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెద్ద మొత్తంలో నగదు అందుబాటులో ఉంచాలని, అలాగే నగదు తీసుకునే పరిమితిని పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.