యాప్నగరం

టికెట్ కౌంటర్ దగ్గర ఫన్నీ బోర్డు.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది..!

పాట్నా రైల్వే స్టేషన్‌లో పెట్టిన బోర్డు నవ్వులు పూయిస్తుంది. టికెట్ కౌంటర్ దగ్గర ఆపరేటర్ అర్జంట్‌గా బాత్రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ప్యాసింజర్లు ఇబ్బంది పడకుండా అక్కడో బోర్డును పెట్టాడు. ఆ బోర్డు ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 1 Sep 2022, 11:31 pm
బస్సు కాంప్లెక్స్‌లోనో, రైల్వే స్టేషన్‌లోనో... టికెట్ కౌంటర్ దగ్గర ఆపరేటర్ లేకపోతే.. ఎవరికైనా చచ్చేంత కోపం వస్తుంది. అర్జంట్‌గా ఊరు వెళ్లాలంటే.. సమయానికి టికెట్ ఇచ్చే వాళ్లు లేకపోతే కోపం రావడం కామన్. అయితే పాట్నా రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్ దగ్గర ఆపరేటర్ లేడు. కానీ అక్కడ ఓ బోర్డు దర్శనమిచ్చింది. ఇప్పుడా బోర్డు నవ్వులు పూయిస్తుంది.
Samayam Telugu Ticket Operator Leaves Funny Note


ఒక్కోసారి అర్జంట్‌గా బాత్రూమ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఎవరికైనా వస్తుంది. ప్రకృతి పిలిస్తే.. వెళ్లకుండా ఎలా ఉండగలం. పాట్నాలోని రైల్వే స్టేష‌న్‌లో టికెట్ ఆప‌రేట‌ర్‌కు అర్జెంట్‌గా బాత్రూమ్‌కి వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే ప్యాసింజర్లు కంగారు పడకూడదనే ఉద్దేశంతో.. కౌంటర్ దగ్గర ఓ సూచన బోర్డు పెట్టి మరీ వెళ్లాడు. ఓ సూచ‌న బోర్డుపై "బాత్‌రూం నుంచి వస్తున్నా.. కాసేపు వేచి చూడండి." అని హిందీలో రాశాడు. అయితే దీనిని చూసిన ప్యాసింజర్లు నవ్వుకున్నారు. ఈ బోర్డును ఓ వ్యక్తి ఏకంగా వీడియో తీశాడు.


దానిని ట్విట్టర్‌లో పెట్టగా.. వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ నోట్‌ను చూసిన వారందరూ నవ్వాపుకోలేకపోతున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకూ లక్షా 28 వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిని 700 కంటే ఎక్కువ మంది షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అతని నిజాయితీని మెచ్చుకుంటే.. మరికొందరు బాధ్యతారాహిత్యం అంటున్నారు. ఒక నెటిజన్ "బిహారీ రాక్స్" అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు "అత్యంత నిజాయితీ గల ప్రభుత్వ అధికారుల్లో ఒకరు" అని కామెంట్లు పెట్టారు.ఏదిఏమైనా ఆయన చేసిన పని నెట్టింట్లో తెగ నవ్విస్తుంది.

Read Also:గ్రామస్థులని బురిడీ కొట్టించేశారు.. విగ్రహాల ముసుగులో వింత ప్లాన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.