యాప్నగరం

ఎగ్జిట్ పోల్స్: ‘మినీ భారత్’లో కమలం పాగా!

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి

TNN 9 Mar 2017, 6:38 pm
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..బీజేపీ 190-210 స్థానాలు గెలుచుకుంటుంది. యూపీని ఢిల్లీ (పార్లమెంటు)కి దగ్గరి దారిగా... మినీ భారత్ గా అభివర్ణిస్తారు.
Samayam Telugu times now vmr exit polls bjp leads in up
ఎగ్జిట్ పోల్స్: ‘మినీ భారత్’లో కమలం పాగా!


ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 110-120 స్థానాలు, బీఎస్పీకి 54-74 సీట్లు, ఆర్ఎల్డీకి 9-13 సీట్లు దక్కుతాయని వెల్లడయ్యింది.

బీజేపీకి 34శాతం ఓట్లు దక్కనుండగా, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 28శాతం, బీఎస్పీకి 24శాతం, ఇతరులకు 14శాతం ఓట్లు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.

ఏబీపీ న్యూస్, న్యూస్ఎక్స్-ఎంఆర్సీ బీజేపీకి 185 సీట్లు, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 120 సీట్లు, బీఎస్పీకి 90 సీట్లు దక్కుతాయని చెప్పింది.

403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 202 స్థానాలు గెలుచుకున్న పార్టీదే అధారం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 15ఏళ్ల తర్వాత యూపీలో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టనుంది.


కుటుంబంలో నెలకొన్న విబేధాల వల్ల ఎస్పీకి ఎదురు దెబ్బలే తగిలాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా..రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రచారం చేసినా...ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి కలిసి రాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.