యాప్నగరం

అమ్మకు భారత రత్న, పార్లమెంటులో విగ్రహం

తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రేపు ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నారు.

Samayam Telugu 18 Dec 2016, 2:02 pm
తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రేపు (సోమవారం) ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నారు. వర్ధా తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాసం కింద కేంద్రం సాయం చేయాలని సీఎం పీఎంను కోరనున్నారు.
Samayam Telugu tn cm panneerselvam to meet modi over bharata ratana for amma
అమ్మకు భారత రత్న, పార్లమెంటులో విగ్రహం


‘దివంగత సీఎం జయలలితకు భారతరత్న బిరుదు ప్రకటించాలని, అమ్మ పేరిట పార్లమెంటు ఆవరణలో కాంస్యవిగ్రహం ఏర్పాటు చేయాలని పన్నీర్ సెల్వం మోదీకి లేఖ ఇస్తారు’ అని తమిళనాడు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

డిసెంబర్ 10న సమావేశమైన తమిళనాడు రాష్ట్రమంత్రిమండలి జయలలితకు కేంద్రం భారత రత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేసింది. దీంతో పాటు పార్లమెంటు కాంప్లెక్స్ లో అమ్మ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని తీర్మానించింది.

డిసెంబర్ 12న వర్ధా తుపానుకు తమిళనాడులోని పలు ప్రాంతాలు అతాలకుతలం అయ్యాయి. ఈ తుపాను వల్ల రాష్ట్రంలో పది మంది మృత్యువాత పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.