యాప్నగరం

నీళ్ల కోసం బాబుకు పన్నీర్ సెల్వం లేఖ

తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం తాగునీటి కష్టాలు తీర్చమంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

TNN 7 Jan 2017, 7:29 pm
తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం తాగునీటి కష్టాలు తీర్చమంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చెన్నై వాసుల గొంతు తడిపేందుకు కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరారు. చెన్నైలో ఏర్పడిన నీటి ఎద్దడి గురించి లేఖలో వివరించారు. ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే వర్షాల వల్లే చెన్నై, ఇతర ప్రాంతాల్లోని రిజర్వాయర్లు నిండుతాయని తెలిపారు. అయితే ఈసారి ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో రిజర్వాయర్లు నీళ్లు లేక వెలవెలలాడుతున్నాయని చెప్పారు. ఉన్న కొద్ది పాటి నీటి నిల్వలతో జూన్ వరకు తాము తాగునీరు అందివ్వగలమని జులై నుంచి మాత్రం చెన్నైకి తాగునీటిని అందించాలని కోరారు.
Samayam Telugu tn cm pannerselvam writes letter to cm chandrababu for drinking water to tamil nadu
నీళ్ల కోసం బాబుకు పన్నీర్ సెల్వం లేఖ


1983లో కుదిరిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం లేఖలో పేర్కొన్నారు. అప్పుడు జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఏటా కండలేరు రిజర్వాయర్ నుంచి 12 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని గుర్తు చేశారు. ప్రస్తుతం కండలేరులో రిజర్వాయర్ స్టోరేజీ 13.53 టీఎంసీల నీరు ఉన్నందున చెన్నైకు నీటిని అందివ్వాలని ఆయన కోరారు. అందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబును లేఖలో కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.