యాప్నగరం

అమ్మకు రూ.15కోట్లతో స్మారకం: ప్రభుత్వం

రూ. 15కోట్ల వ్యయంతో దివంగత సీఎం జయలలితకు స్మారక కేంద్రం నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

Samayam Telugu 10 Dec 2016, 2:58 pm
రూ. 15కోట్ల వ్యయంతో దివంగత సీఎం జయలలితకు స్మారక కేంద్రం నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అమ్మ మరణానంతర మొదటిసారిగా సమావేశమైన కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
Samayam Telugu tn govt allocates rs 15 crore for ammas memorial
అమ్మకు రూ.15కోట్లతో స్మారకం: ప్రభుత్వం


అమ్మ పేరిట స్మారక కేంద్రాన్ని నిర్మించేందుకు పనులు వెంటనే ప్రారంభమవుతాయని ఓ మంత్రి వెల్లడించారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత పార్దీవదేహాన్ని డిసెంబర్ 5న ఖననం చేశారు.

అయితే పబ్లిక్ వర్క్ శాఖ అధికారులు మాత్రం...ప్రస్తుతం అతిథులు అమ్మ ఘాట్ ను సందర్శించడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు.

కాగా, అమ్మ సమాధిని ఆమె స్నేహితురాలు శశికళ, సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు ఎడపడి పళనిస్వామి, పి.తంగమణి తదితరులు సందర్శించారు. శశికళ అమ్మ సమాధిని సందర్శించిన సమయంలో పన్నీరు సెల్వం, ఇతరులు దూరంగా నిలబడి ఉన్నారు. శశికళ వెంట ఆమె మరదలు ఇళవరసి, పోయెస్ గార్డెన్ లో పనిచేసేవారు ఉన్నారు.

అనంతరం పన్నీరు సెల్వం, ఇతర మంత్రు సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఇద్దరు మంత్రులు అక్కడే తలనీలాలు సమర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.