యాప్నగరం

జల్లికట్టు హింసాత్మకం: బిల్లు కోసం అసెంబ్లీ

జల్లికట్టు ఆందోళనకారులు చెన్నైలోని ఐస్ హౌస్ పోలీసు స్టేషన్, ట్రిపుల్ కేన్ పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు.

Samayam Telugu 23 Jan 2017, 1:04 pm
జల్లికట్టు ఆందోళనకారులు చెన్నైలోని ఐస్ హౌస్ పోలీసు స్టేషన్, ట్రిపుల్ కేన్ పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. పలు వాహనాలకు దగ్ధం చేశారు. జల్లికట్టుపై చట్టం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇతర ప్రభుత్వం ఆస్తులపై దాడులకు దిగారు.
Samayam Telugu tn to pass bill on jallikattu after protest turns violent
జల్లికట్టు హింసాత్మకం: బిల్లు కోసం అసెంబ్లీ


శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం వల్లే హింస నెలకొందని ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్, సినీ స్టార్లు కమల్ హాసన్, ఖుష్బూలు ఆరోపించారు. ‘పెటా’ వంటి సంస్థలు తమిళనాడును వదిలి వెళ్లాని ఖష్బూ హెచ్చరించారు.
జల్లికట్టుపై ఆర్డినెన్స్ కాదు చట్టం కావాలంటూ వారంరోజులుగా వేలాదిమంది యువకులు మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్నారు. సోమవారం పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జీ చేయడంతో...ఆందోళనకారులు రెచ్చిపోయారు.
మధురైలోని అలంగనల్లూరులో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ ఝళిపించారు.

దీంతో చెన్నైలో స్థానిక రైళ్ల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. అటు ఆందోళనకారులు ఇంకా మెరీనా బీచ్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు.

జల్లికట్టు చట్టం కోసం రాష్ట్రంలో హింస చెలరేగిన నేపథ్యంలో....తమిళనాడు ప్రభుత్వం సోమవారం సాయంత్రం అసెంబ్లీని సమావేశ పరిచి...ఒక్కరోజులోనే బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.