యాప్నగరం

బిచ్చమెత్తుతూ గిరిజన బాలలను చదివిస్తున్న కళాకారుడు!

పేద పిల్లల కోసం పాఠశాల స్థాపించిన ఆ కళాకారుడు.. బిక్షాటన చేసిర మరీ వారికి ఉచితంగా పుస్తకాలు, బోధన, భోజన సదుపాయాలు కల్పిస్తున్నాడు.

Samayam Telugu 26 Dec 2018, 7:02 pm
కొందరు తాము సంపాదించిన దానిలో ఎంతో కొంత పేదలకు దానమిస్తారు. మరికొందరు ఎంత సంపాదించినా దానం ఇచ్చేందుకు ముందుకు రారు. అయితే, తమ వద్ద చిల్లిగవ్వ లేకున్నా.. కష్టాల్లో ఉన్న ఎదుటి వ్యక్తిని ఆదుకోడానికి ముందుకు వచ్చే వ్యక్తులు మాత్రం చాలా కొద్దిమందే కనిపిస్తారు.
Samayam Telugu Untitled231


అలాంటి వ్యక్తుల్లో ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నరేన్ హన్సదా. పురిలియాలో నివసిస్తున్న నరేన్ గిరిజన చిన్నారుల కోసం ‘సిధో కన్హో’ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. సారంగి వాద్యంతో పాటలు పాడుతూ సంపాదించే సొమ్మును ఈ స్కూల్ నిర్వహణకు ఖర్చు పెడుతున్నాడు. నరేన్ తన పాఠశాలలో విద్యార్థులకు చదువులు మాత్రమే కాదు, మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నాడు.

పుస్తకాలను సైతం ఉచితంగా అందిస్తున్న నరేన్.. బంగ్లా, గిరిజన సంగీతంలో కూడా శిక్షణ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా నరేన్ సోదరుడు సౌరన్ మాట్లాడుతూ.. ‘‘నరేన్ సారంగి వాయించడమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. దేశమంతా తిరుగుతూ సారంగి వాయిస్తూ సంపాదించే సొమ్మును గిరిజన బాలల చదువులు కోసం ఖర్చు చేస్తున్నాడు.

నరేన్ తమ జిల్లాల్లోనే కాకుండా కోల్‌కతా, ముంబయి వంటి నగరాలకు వెళ్లి సారంగి వాయిస్తూ బిచ్చమెత్తుతూ పాఠశాల నిర్వహణకు అవసరమైన డబ్బును సంపాదిస్తున్నాడు. ఇటీవల ముంబయి వీధుల్లో తిరుగుతూ సారంగి వాయిస్తూ రూ.50 వేలు సంపాదించాడు. ప్రస్తుతం నరేన్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మా ‘ఎయి సమయ్’ ప్రతినిధితో మాట్లాడుతూ.. ‘‘చలి చాలా తీవ్రంగా ఉంది. చిన్నారులకు చలికాలం దుస్తులు అవసరం. చూద్దాం, ఇక్కడ నేను ఎంత వరకు సంపాదించగలనో’’ అని తెలిపాడు.
రిపోర్టర్: సంజీత్ గోస్వామి, ఎయిసమయ్
Read this article in Bengali

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.