యాప్నగరం

భారత్ లో పేలుళ్లకు అజీజ్ వ్యతిరేకమా?

హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో , సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడాకు నిజానికి ఇక్కడ దాడులు చేయటం ఇష్టం లేదా? అవునని పలు ఆదారాలు వెల్లడిస్తున్నాయి.

TNN 24 Feb 2016, 3:56 pm
హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో , సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడాకు నిజానికి ఇక్కడ దాడులు చేయటం ఇష్టం లేదా? అవునని పలు ఆదారాలు వెల్లడిస్తున్నాయి. భారత్ లో ముస్లింలు ఆర్థికంగా బాగున్నారని జిహాద్ అవసరం లేదని వాదించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తలో వెల్లడించింది.
Samayam Telugu top jihadi aziz opposed attacks in india
భారత్ లో పేలుళ్లకు అజీజ్ వ్యతిరేకమా?


డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసిన అజీజ్ ఎలక్ట్రిషియన్‌గా పని చేసుకుంటూ నగరానికి చెందిన దర్సగ ఈ జిహాదో షాహాదత్ సంస్థతో కలిసి పని చేశాడు. 1989లో అజీజ్ సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రిషియన్‌గా పని చేశాడు. అక్కడ కొంత డబ్బు సంపాదించుకుని హైదరాబాద్ నగరంలో సొంత వ్యాపారం పెట్టేందు కోసం మళ్లీ ఇక్కడికి వచ్చాడు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసంతో జిహాదీలో కలిసేందుకు మళ్లీ సౌదీకి వెళ్లాడు. అక్కడినుంచి జెడ్డా వెళ్లే ప్రయత్నంలో అరెస్టయ్యాడు. పదేళ్లు అక్కడి జైల్లో ఉన్నాడు. విడుదలైన అనంతరం బోస్నీయాలోని జెనికాలో బోస్నీయా మిలీషియా ద్వారా అజీజ్ ఉగ్ర శిక్షణ పొందాడు. ఆ తర్వాత రష్యా సైన్యంతో పోరాడేందుకు చెచెన్యాలోని షాటోయస్కీకి సౌదీ సహచరులతో పయనమయ్యాడు. 1997లో భారత్ లో జిహాద్ కోసం అతన్ని లష్కరే తోయిబా సంస్థ పంపింది. ఆ సమయంలో అతను భారత్ లో ముస్లింలు ఆర్థికంగా బాగున్నారని జిహాద్ అవసరం లేదని వాదించాడు. చివరకు ఎలాగోలా అతన్ని నాయకులు కన్విన్స్ చేసి భారత్ కు పంపారు. అక్కడినుంచి వచ్చి జంటనగరాల పేలుళ్లలో పాల్గొన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.