యాప్నగరం

Chennai Earthquake: చెన్నైలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ జనం

భూకంప కేంద్రం చెన్నై నుంచి 609 కిలో మీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు.

Samayam Telugu 12 Feb 2019, 10:54 am

ప్రధానాంశాలు:

  • తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో భూకంపం
  • చెన్నైలో స్వల్పంగా ప్రకంపనలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu chennai
బంగాళాఖాతంలో మంగళవారం (ఫిబ్రవరి 12) ఉదయం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో భూమి కంపించిందని, రిక్టర్‌స్కేలుపై 4.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం చెన్నై నుంచి 609 కిలో మీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో చెన్నై నగరంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. దీంతో చెన్నై నివాసులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. మరోవైపు చెన్నైలో ఉదయం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు భూకంపం, మరోవైపు వర్షం పడటంతో ఇదెక్కడ.. సునామీకి దారితీస్తుందో అని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
అయితే భూకంప తీవ్రత బంగ్లాదేశ్‌పై ఎక్కువగా ప్రభావం చూపిందని.. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇలాంటి భూకంపాలు అండమాన్, నికోబార్ దీవులలో తరచుగా సంభవిస్తుంటాయి. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.