యాప్నగరం

తలాక్‌ను 1400 ఏళ్లుగా అనుసరిస్తున్నాం: ముస్లిం లా బోర్డు

తలాక్ ద్వారా విడాకులు తీసుకోవడమే విధానాన్ని ముస్లింలు గత 1400 ఏళ్లుగా అనుసరిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

TNN 16 May 2017, 1:37 pm
తలాక్ ద్వారా విడాకులు తీసుకోవడమే విధానాన్ని ముస్లింలు గత 1400 ఏళ్లుగా అనుసరిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీన్ని క్రీస్తు శకం 637 నుంచి అనుసరిస్తున్నారని, ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అంతే కాదు ఇది మత విశ్వాసానికి సంబంధించిన విషయం.... ఇందులో రాజ్యాంగపరమైన నైతికత, సమానత్వానికి తావేలేదని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కోర్టులో ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదనలు వినిపించారు. అలాగే రాముడు అయోధ్యలో జన్మించాడని హిందువులు ఎంత బలంగా నమ్ముతారో, ముస్లింలు కూడా తలాక్‌పై అంతే విశ్వాసంతో ఉంటారని సిబల్ పేర్కొన్నారు.
Samayam Telugu triple talaq matter of faith for last 1400 years aimplb
తలాక్‌ను 1400 ఏళ్లుగా అనుసరిస్తున్నాం: ముస్లిం లా బోర్డు


రాముడు అయోధ్యలో జన్మించాడనేది నా విశ్వాసం, దీనికి రాజ్యాంగ నైతికత లేదని జస్టిస్ జేఎస్ ఖేర్‌తో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి తెలియజేశారు. ముస్లింల వివాహం, విడాకులంటే నిఖానమా ద్వారా పెద్దల అంగీకారంతో చేసుకునే ఒక ఒప్పందం లాంటిదని అన్నారు. ఈ రెండు ఒప్పందం అయినప్పుడు దీన్ని ఎందుకు సమస్యగా చూడాలని గట్టిగా వాదించారు. ట్రిపుల్ తలాక్ హిదత్‌లో ఉందని, ఇది మహ్మద్ ప్రవక్త తర్వాత అమల్లోకి వచ్చిందని సిబల్ పేర్కొన్నారు. జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారిమన్, యూయూ లలిత్, అబ్దుల్ నజీర్ ధర్మాసనం ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు తన వాదనలను వినిపిస్తోంది.

తలాక్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామన్న కేంద్రం ప్రకటనపై సిబల్ స్పందించారు. సుప్రీంకోర్టు రద్దు చేస్తే, పార్లమెంటు వ్యతిరేకిస్తుందని అన్నారు.ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టులో నేడు వాదనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నేటి వాదనలను పరిశీలిస్తే, ముస్లిం మత పెద్ద ముందు కూర్చుని తలాక్ చెప్పి, భార్యకు పరిహారం ఇచ్చి, సంప్రదాయబద్ధంగా విడాకులు తీసుకోవడాన్ని సమర్థిస్తూ, టెలిఫోన్, ఇంటర్నెట్, వాట్స్ యాప్ వంటి మార్గాల్లో తలాక్ చెప్పడం చెల్లదని తీర్పు ఇవ్వవచ్చని న్యాయ కోవిదులు అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.