యాప్నగరం

మెట్రో ట్రైన్‌లో పుట్టిన రోజు వేడుకలు.. తొలిసారిగా 12 ఏళ్ల బాలుడి బర్త్‌డే

మెట్రో ట్రైన్‌లో వేడుకలు జరుపుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. తొలిసారిగా 12 ఏళ్ల బాలుడి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మెట్రో ట్రైన్‌లో పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్నాడు. ఈ అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గంటకు ఐదు వేల రూపాయల నుంచి పది వేల వరకు తీసుకుంటారు. మెట్రోలో డెకరేషన్స్‌ బట్టి ఈ రేటు పెరిగే అవకాశం ఉంది. దీనికోసం ముందుగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు రీఫండబుల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 27 May 2022, 4:25 pm

ప్రధానాంశాలు:

  • కదులుతున్న మెట్రోలో వేడుకల నిర్వహణ
  • కస్టమర్లను ఆకర్షిస్తోన్న మంచి ఆఫర్
  • గంటకు రూ. 5,000 నుంచి రూ. 10,000లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మెట్రో ట్రైన్‌లో పుట్టిన రోజు వేడుకలు.. తొలిసారిగా 12 ఏళ్ల బాలుడి బర్త్‌డే
మెట్రోలో మొట్టమొదటగా 12 ఏళ్ల బాలుడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. నోయిడా-గ్రేటర్ నోయిా మెట్రో ఆక్వా లైన్‌లో నడిచే మెట్రో ట్రైన్‌లో తన స్నేహితులతో కలసి సెలబ్రేట్ చేసుకున్నట్టు రైలు ఆపరేటర్ చెప్పారు.
నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ ఫిబ్రవరి 2020లో నాన్ ఫేర్ బాక్స్ ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో బుక్ చేసుకున్న వారికి మెట్రో రైళ్లలో ప్రైవేట్ వేడుకలను జరుపుకునే ఆఫర్‌ను ప్రకటించింది. అయితే కోవిడ్ కారణంగా 2020 నుంచి 2021లో ప్రయాణికుల కోసం మెట్రో రైలు సేవలు రెండుసార్లు నిలిచిపోయాయి. ఆ టైంలో పుట్టిన రోజు వేడుకలు లేదా వివాహానికి ముందు ఈవెంట్‌ల వంటి బుకింగ్ కోచ్‌ల కోసం ప్రత్యేక సర్వీస్ కూడా నిలిచిపోయింది. కోవిడ్ వైరస్ కేసుల తగ్గుదలతో మళ్లీ మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. దాంతో మళ్లీ పుట్టినరోజు వేడుకలను జరుపుకునే ఆఫర్‌ను తెరపైకి తెచ్చారు.

దీంతో మొట్టమొదటగా నోయిడాలోని ఓ మెట్రలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. సెక్టార్ 121లో నివాసం ఉంటున్న సుప్రియా రాయ్ సెక్టార్ 51 మెట్రో స్టేషన్‌లో తన కొడుకు 12వ పుట్టినరోజును నిర్వహించారు. ఇది నోయిడా మెట్రో చక్రాలపై వేడుకల ప్రారంభ స్టేషన్‌లో ఉన్న రైళ్లో ఈ వేడుకను జరుపుకున్నారని NMRC మేనేజింగ్ డైరెక్టర్ రీతూ మహేశ్వరి తెలిపారు.


ఈ సందర్భంగా ఎన్‌ఎంఆర్‌సీ బృందం ఆక్వా లైన్‌లో పుట్టిన రోజు వేడుకలకు మొదటి కస్టమర్ కావడంతో షాయం అనే చిన్నారిని పుష్పగుచ్ఛంతో సత్కరించింది. NMRC ప్రత్యేక చొరవతో మెట్రోలో ప్రయాణంతో పాటు, వినోదం వేడుకల కోసం కూడా అవకాశం కల్పించడం అందరిని ఆకర్షిస్తుంది. చాలా సరమైన ధరలతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

మెట్రోలో పుట్టిన రోజు కోసం ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు రైల్లో గరిష్టంగా నాలుగు కోచ్‌ల వరకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. బుకింగ్‌ కోసం ఆసక్తిగల దరఖాస్తుదారులు కనీసం 15 రోజుల ముందుగా NMRCకి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికోసం వినియోగదారులు లైసెన్స్ రుసుమును సమర్పించాల్సి ఉంటుంది. కోచ్‌లో గంటకు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ట్రైన్‌లో డెకరేషన్స్‌ బట్టి ఫీజు పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ముందుగా రూ.20,000 రీఫండబుల్ ఫీజును పే చేయాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.