యాప్నగరం

UP Teachers: రెచ్చిపోయిన మహిళా టీచర్లు... ఒక రేంజ్‌లో కొట్టుకున్నారు.. పాపం విద్యార్థులు

ఉత్తరప్రదేశ్‌లో (UP Teachers) ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా టీచర్లు దారుణంగా కొట్టుకుంటున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ.. దూషించుకుంటూ ఘర్షణ పడ్డారు. విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి.. కొట్లాడుకున్నారు. విద్యార్థులు వారు గొడవను చూస్తూ ఉండిపోయారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. వారిని సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టారు. యూపీలోని టీచర్లు ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 4 Oct 2022, 7:01 pm

ప్రధానాంశాలు:

  • రణరంగంగా మారిన పాఠశాల
  • తిట్టుకుంటూ, కొట్టుకున్న టీచర్లు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu UP Female Teachers
UP Teachers: విద్యా బుద్ధులు నేర్పించే పాఠశాల రణరంగంగా మారింది. సాధారణంగా స్కూల్లో విద్యార్థులే కొట్టుకుంటూ ఉంటారు. ఉపాధ్యాయులు వారిని ఆపుతుంటారు. కానీ ఓ స్కూల్లో విద్యార్థులు ముందు టీచర్లు కొట్టుకున్నారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. హమీర్ పూర్ జిల్లాలో ఓ స్కూల్లో ఇద్దరు మహిళా టీచర్లు, ఒక మహిళా సహాయకురాలు ఘర్షణ పడ్డారు. విద్యార్థుల ముందు ఒకరినొకరు దూషించుకున్నారు. తోసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ముగ్గురు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులు ఒకరినొకరు కొట్టుకున్నారు.

కురారా పట్టణంలోని బాలికల ప్రీ సెకండరీ పాఠశాలలో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో టీచర్లు ఒకరి నుంచి ఒకరు ఫోన్లు లాక్కోవడం, ఒకరినొకరు తోసుకోవడం వంటి దృశ్యాలు ఉన్నాయి. పాఠశాలలో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో విద్యార్థులు పరుగులు తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.


అసలేం కొట్టుకున్నారంటే..
స్కూల్లో కొట్టుకున్న వారిలో ఒకరు ప్రిన్సిపాల్, మరొకరు అసిస్టెంట్ టీచర్, ఇంకో వ్యక్తి మహిళా సహాయకురాలుగా గుర్తించారు. అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఆ సందర్భంగా అసిస్టెంట్ టీచర్ నహిద్ హష్మీ సమక్షంలో విద్యార్థులు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. అలా వాళ్లు డ్యాన్స్ చేస్తుండగా.. స్కూల్ ప్రిన్సిపాల్ ప్రీతి నిగమ్ అక్కడకు వెళ్లి.. జాతీయ జెండాను ఎగురవేయాలని.. పిల్లలకు బయటకు రమ్మని పిలిచారు. దాంతో నహిద్ హష్మీకి కోపం వచ్చి ప్రీతిపై అరిచారు. పిల్లలను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు కొట్టుకున్నారు. భయంతో కొందరు విద్యార్థులు తరగతి గది బయటికి పరుగులు తీశారు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. బేసిక్ శిక్షా అధికారి (బీఎస్‌ఏ) కల్పనా జైస్వాల్ ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఘర్షణపై విచారణ జరుగుతోంది. కాగా ఇటీవల పాఠశాలలో టీచర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే బీరు బాటిళ్లు పెట్టుకుని.. తాగుతున్న వీడియో బయటకొచ్చింది. మద్యం మత్తులో పిల్లలకు పాఠాలు చెబుతున్నాడు. రెండు మద్యం బాటిళ్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌లో చోటుచేసుకుంది. సంబంధిత వీడియో బయటకు రావడంతో డీఎం ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.

Read Also:క్లాస్‌రూమ్‌లో బీరు బాటిళ్లు... మందు కొడుతూ... పాఠాలు బోధిస్తున్న టీచర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.