యాప్నగరం

మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల అతి.. దిమ్మతిరిగింది!!

మూతికి మాస్క్ పెట్టుకోలేదని ఆపిన పోలీసులు రెచ్చిపోయారు. యువకుడిని చితకబాదడంతో కథ అడ్డం తిరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు కానిస్టేబుళ్లకు దిమ్మతిరిగిపోయింది.

Samayam Telugu 7 Apr 2021, 5:51 pm
కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ముఖానికి మాస్క్ లేదంటూ బైకర్‌ని ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. రెచ్చిపోయి అతన్ని చితకబాది చిక్కుల్లో పడిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mask


ఇండోర్ నగరానికి చెందిన యువకుడు(35)ను మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆపారు. మాస్క్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై యువకుడిని చితకబాదారు. మహిళలు, పిల్లలు వేడుకుంటున్నా అత్యంత అమానుషంగా కొట్టారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. కనీసం జాలి, దయ లేకుండా దారుణంగా కొట్టిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.

యువకుడిని పోలీసులు చితకబాదిన ఘటనను విచారించాల్సిందిగా సీఎస్‌పీ ఆదేశాలిచ్చిన్లు బగ్రి తెలిపారు. మాస్క్ పెట్టుకోకుండా వస్తున్న యువకుడిని ఆపి.. కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించలేదని అడిగినందుకు కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారని.. వివాదం ముదరడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు ఎడిటింగ్ చేసినవని చెప్పారు. సదరు యువకుడిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.