యాప్నగరం

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోలు హతం, ఆరుగురికి గాయాలు

మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

Samayam Telugu 15 Sep 2019, 12:51 pm
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు వారికి కోసం కూబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో పోలీసులకు ఎదురుపడ్డ నక్సల్స్ కాల్పలు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆటోమేటిక్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu gadchi


అజ్ఞాతంలో ఉన్న మోస్ట్ వాంటెండ్ నక్సల్ భాస్కర్ గడ్చిరోలి ప్రాంతంలో సంచరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. మే 1న పోలీసులపై మావోయిస్టులు జరిపిన దాడికి వ్యూహరచన చేసినవారిలో భాస్కర్ ఒకరు. తాజా ఆపరేషన్‌లో భాస్కర్ గాయపడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భాస్కర్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న నక్సల్స్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

కాగా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని చత్తీస్‌గఢ్‌లో శుక్రవారం రాత్రి, శనివారం జరిగిన మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం ఆరుగురు మావోయిస్టులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. సుక్మా, బిజాపూర్, దంతేవాడ జిల్లాలో ఇవి చోటుచేసుకున్నాయి. శనివారం సాయంత్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ హతమయ్యారు. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాడ్‌మెట్ల-ముక్రామ్ కాలువ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.