యాప్నగరం

పెళ్లి చేసుకోమని తోటి మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

ఒకరితో పెళ్లి.. మరో ఇద్దరితో సంబంధం.. చివరికి కథ విషాదాంతం.. ప్రాణాలను బలి తీసుకుంటున్న వివాహేతర సంబంధాలు..

Samayam Telugu 1 Oct 2018, 12:53 pm
తోటి మహిళా కానిస్టేబుళ్ల వేధింపులకు వివాహితుడైన ఓ కానిస్టేబుల్ బలయ్యాడు. తమను పెళ్లి చేసుకోవాలంటూ వారు పెట్టిన టార్చర్ భరించలేక విషం తాగి పాపం నిండు ప్రాణాలను తీసుకున్నాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. మృతుడి భార్య చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu Suicide..


కొల్హాపూర్‌ సమీపంలోని రాజారాంపురికి చెందిన కానిస్టేబుల్‌కు గతంలోనే వివాహమయ్యింది. అయితే 2012-2104 మధ్య అతడు గాంధీ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో పనిచేశాడు. ఈ క్రమంలో అతడికి అదే పీఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో పరిచయం ఏర్పడింది. సదర్ కానిస్టేబుల్ ఆ మహిళలతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాడు. ఈ విషయం స్టేషన్‌లో సీనియర్ అధికారులకు తెలియడంతో.. ముగ్గుర్ని అక్కడి నుంచి బదిలీ చేశారు. ట్రాన్స్‌ఫర్ తర్వాత కానిస్టేబుల్ తన పద్దతిని కాస్త మార్చుకున్నాడు. ఆ మహిళా కానిస్టేబుళ్లకు కాస్త దూరంగా ఉంటున్నాడు.

అతడు వారిని దూరం పెట్టినా .. మహిళా కానిస్టేబుళ్లు మాత్రం వదల్లేదు. తరచూ ఫోన్ చేస్తూ విసిగిస్తున్నారు.. తమలో ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగారు. ఓ మహిళా కానిస్టేబుల్.. అతడి భార్య వద్దకు వచ్చి విడాకులు ఇవ్వాలని బెదిరించింది. రోజూ వేధింపులు పర్వం కొనసాగుతుండటంతో.. కానిస్టేబుల్ మనస్తాపం చెందాడు. సెప్టెంబర్ 24న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. భార్య వెంటనే గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి చికిత్సపొందుతూ బాధితుడు.. రెండు రోజుల క్రితం చనిపోయాడు.

తన భర్త చనిపోవడానికి మహిళా కానిస్టేబుళ్లే కారణమంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి వేధింపులు భరించలేకే ప్రాణాలు తీసుకున్నాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళా కానిస్టేబుళ్లను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.