యాప్నగరం

ఆ న్యూస్ ఛానల్ మూతపడుతోంది..!

ఓల్డెస్ట్ న్యూస్ ఛానల్ గా పేరుంది..

TNN 24 Aug 2017, 7:58 am
కన్నడలో ఓల్డెస్ట్ న్యూస్ ఛానల్ గా పేరు పొందిన ‘ఉదయ న్యూస్’ మూత పడనుంది. ఈ విషయాన్ని సన్ నెట్ వర్క్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నిబంధనలకు అనుగుణంగా కర్ణాటక లేబర్ మినిస్ట్రీకి సన్ నెట్ వర్క్ సమాచారం అందించింది. ప్రేక్షకాదరణ లభించలేదని, నష్టాలు తీవ్రంగా ఉన్నాయని..అందుకే ఛానల్ ను నడపలేకపోతున్నామని.. ప్రభుత్వానికి సన్ నెట్ వర్క్ నివేదించింది. అక్టోబర్ 24 నుంచి ఉదయ న్యూస్ టీవీ ప్రసారాలు ఆగిపోతాయని సన్ నెట్ వర్క్ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొందని తెలుస్తోంది.
Samayam Telugu udaya news to shut shop
ఆ న్యూస్ ఛానల్ మూతపడుతోంది..!


ముందస్తుగా ఉద్యోగులకు కూడా సమాచారం అందించామని.. ఈ ఛానల్ మూసివేతతో 73 మందిని ఉద్యోగులను తాము వదులుకొంటున్నట్టుగా ఆ సన్ నెట్ వర్క్ ప్రకటించింది.

కన్నడలో సన్ నెట్ వర్క్ కు మంచి ప్రస్థానమే ఉంది. చాలా సంవత్సరాల క్రితమే న్యూస్ విభాగాన్ని ఆరంభించారు. తదనంతర కాలంలో ఇరవై నాలుగు గంటల వార్తా చానల్ ను ఆరంభించారు. కానీ ప్రేక్షకాదరణ పొందడంలో సక్సెస్ కాలేకపోయామని.. ఇప్పుడు ఆ నెట్ వర్క్ వాళ్లే పేర్కొంటున్నారు. అందుకే ఛానల్ ప్రసారాలనే ఆపేయాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.