యాప్నగరం

Shiv Sena: దసరా ర్యాలీలో ఘర్షణ... కొట్టుకున్న ఉద్ధవ్, షిండే మద్దతుదారులు

మహారాష్ట్రలో ఉద్దవ్, (Shiv Sena) షిండే మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు వేర్వేరుగా దసరా ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో వారు కుమ్ములాడుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణించింది. కాగా దాదాపు 56 ఏళ్ల తర్వాత శివసేన వేర్వేరు దసరా ర్యాలీలు నిర్వహిస్తుంది. గతంలో ఎప్పుడూ శివసేన ఆధ్వర్యంలో ఒక్కటే ర్యాలీ జరిగేంది. కానీ ఈ ఏడాది ఉద్దవ్ థాక్రే, షిండే వర్గాలు రెండుగా చీలిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 5 Oct 2022, 7:42 pm

ప్రధానాంశాలు:

  • ఉద్దవ్, షిండే వర్గాల కుమ్ములాట
  • దసరా ర్యాలీలో గొడవ పడ్డ మద్దతుదారులు
  • పోలీసుల జోక్యంతో సద్ధుమణిగిన గొడవ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Dussehra rallies
ముంబైలో శివసేన (Shiv Sena) ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ రసాబాసాగా మారింది. ఈ ర్యాలీలో ఉద్ధవ్ థాక్రే వర్గం, ఏక్‭నాథ్ షిండే వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. వాస్తవానికి 56 ఏళ్ల తర్వాత శివసేన రెండుగా చీలి.. వేర్వేరు ర్యాలీలు నిర్వహిస్తోంది. ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలు సెపరేట్ ర్యాలీలు నిర్వహించాయి. అయితే మహిళా ఉద్ధవ్ థాక్రే మద్దతుదారుల బృందం ర్యాలీలో పాల్గొనేందుకు నాసిక్ నుంచి ముంబైకి వెళ్తుండగా నాసిక్-ఆగ్రా హైవేపై ఇరు వర్గాలకు చెందిన వారు గొడవ పడ్డారు.
తాము ప్రయాణిస్తున్న బస్సును ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు షిండే గ్రూప్ మద్దతుదారులు అభ్యంతరకరమైన సైగలు చేశారని ఉద్దవ్ మద్దతుదారులు ఆరోపించారు. అనంతరం వారిని అడ్డగించి బుద్ధి చెప్పాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ క్రమంలో వారి వాహనాన్ని అడ్డుకుని మరీ షిండే గ్రూప్ అనుచరులను కొట్టారు. దాంతో ఇరు వర్గాల వ్యక్తులు ఒకరినొకరు కుమ్ములాడుకున్నారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్ధుమణిగింది.

నిజానికి దాదర్‭లోని శివాజీ పార్కులో దసరా ర్యాలీ తీసేందుకు శివసేన లోని ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి ఆ అవకాశం దక్కింది. నిజానికి 1966 నుంచి శివసేన శివాజీ పార్కులో దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో షిండే వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఎంఎంఆర్‭డీఏ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించింది. ఇలా పోటాపోటీ దసరా వేడుకలు నిర్వహించడంతో ఇరు వర్గాల మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.