యాప్నగరం

చిన్నారులను చిదిమేస్తే.. ఇక మరణ శిక్షే!

చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కేబినెట్అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.

Samayam Telugu 21 Apr 2018, 2:37 pm
కథువా, ఉన్నావ్ చిన్నారుల రేప్ ఘటనలతో జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి ఘటనలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. తాజాగా ఇండోర్‌లోనూ నెలల వయసున్న ఓ చిన్నారిని అపహరించిన కామాంధుడు.. రేప్ చేసి దారుణంగా హతమార్చాడు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలను ఉరి తీయాలనే డిమాండ్‌తో జనం వీధుల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. నానాటికీ తీవ్రమవుతున్న ప్రజాగ్రహానికి కేంద్రం స్పందించింది.
Samayam Telugu rape on minor1


చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కేబినెట్అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కేంద్రం నిర్ణయంతో 12 ఏళ్ల చిన్నారులపై రేప్ చేసిన వారికి ఉరిశిక్ష విధించేందుకు వీలుగా క్రిమినిల్ లాను మార్చనున్నారు. అందులో భాగంగా పోక్సో చట్టానికి కూడా సవరణలు చేయనున్నారు.

కథువాలో చిన్నారిని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హతమార్చడంతో.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గతవారం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం మైనర్‌పై అత్యాచారం చేస్తే... కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తుండగా.. గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.