యాప్నగరం

రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. అకౌంట్లలో 18 వేల కోట్లు

National Farmers Day 2020: వర్చువల్‌ విధానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 2 కోట్ల మంది వరకూ రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వ్యవసాయ మంత్రి చెప్పారు.

Samayam Telugu 23 Dec 2020, 6:34 pm
దేశ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ పథకం కింద దేశంలోని 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18 వేల కోట్లను జమ చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్‌పేయీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
Samayam Telugu ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
modi


వర్చువల్‌ విధానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 2 కోట్ల మంది వరకూ రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వ్యవసాయ మంత్రి చెప్పారు. బుధవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రూరల్ ఇండియా ఎన్జీవో కాన్ఫడరేషన్ ప్రతినిధులతో వ్యవసాయ మంత్రి సమావేశమయ్యారు. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా లక్ష గ్రామాల్లో 3,13,363 మంది రైతులు చేసిన సంతకాలతో కూడిన డబ్బాలను ఎన్జీవో ప్రతినిధులు తోమర్‌కు అందజేశారు.

మరోవైపు, 25న వర్చువల్ విధానంలో మోదీ కార్యక్రమం ఉంటుందని ప్రధాని కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలు ఈ కార్యక్రమంతో తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాసిన లేఖను రైతులంతా చదవాలని ప్రకటనలో ప్రధాని కోరారు. గతవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో రైతులతో ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు రైతులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు, బుధవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు నిరాహార దీక్ష చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.