యాప్నగరం

అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి జేపీ నడ్డా ఫోన్

ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన అనంతరం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో...

Samayam Telugu 5 Dec 2016, 4:57 am
ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన అనంతరం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెన్నైలో ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి చెర్మైన్ ప్రతాప్ సి రెడ్డికి ఫోన్ చేశారు. ప్రస్తుతం జయ పరిస్థితి ఏంటని నేరుగా ఆస్పత్రి చైర్మన్‌నే వివరాలు అడిగి తెలుసుకున్నారు నడ్డా. ఆదివారం సాయంత్రం వరకు సాధారణ వార్డులోనే చికిత్స పొందుతున్న జయలలితను గుండెపోటు వచ్చిన తర్వాత ఐసీయుకి తరలించారు. లండన్‌తోపాటు ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణుల పర్యవేక్షణలోని డాక్లర్ల బృందం ప్రస్తుతం జయకు చికిత్స అందిస్తోంది. ఇంకొంతమంది వైద్య నిపుణులు కూడా ఎయిమ్స్ నుంచి చెన్నైలోని అపోలోకి చేరుకుంటున్నారని ఆదివారం రాత్రి అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూతురు, అపోలో హాస్పిటల్స్‌లోని కొన్ని విభాగాలకు హెడ్‌గా వ్యవహరిస్తున్న సంగీతా రెడ్డి ఆదివారం అర్థరాత్రి దాటాకా మరోమారు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. తమ హాస్పిటల్లోని డాక్టర్ల బృందం జయలలితను కాపాడుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu union health minister jp nadda calls apollo hospitals chairman c prathap reddy
అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి జేపీ నడ్డా ఫోన్

Our doctors are closely monitoring Hon'ble CM's condition and they are trying their very best. #GodblessAmma @HospitalsApollo— Sangita Reddy (@SangitaApollo) December 4, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.