యాప్నగరం

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోమంత్రి అమిత్ షా

గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ సీనియర్ డాక్టర్లు షాకు వైద్యం అందిస్తున్నారు.

Samayam Telugu 18 Aug 2020, 10:56 am
కేంద్రమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో అమిత్‌ షాకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Samayam Telugu అమిత్ షా


అమిత్ షాకు ఇటీవలే కరోనా సోకింది.. ఆగస్టు 2న పాజిటివ్ తేలింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన గురుగ్రామ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్టు ఈనెల 14న అమిత్ షా ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరగానే కోలుకుని డిశ్చార్జ్ అవుతారంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.