యాప్నగరం

రిజర్వేషన్ల వల్లే అత్యాచారాలు: కేంద్ర మంత్రి!!

దేశంలో రిజర్వేషన్ల విధానంపై కేంద్ర మంత్రి రాందాస్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో అత్యాచారాలు తగ్గాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాల‌ని సూచించారు.

TNN 7 Sep 2017, 3:47 pm
దేశంలో రిజర్వేషన్ల విధానంపై కేంద్ర మంత్రి రాందాస్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో అత్యాచారాలు తగ్గాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాల‌ని సూచించారు. రిజర్వేషన్ స‌మ‌స్య‌ల కార‌ణంగానే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయ‌ని రాందాస్ అథవాలే వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దేశంలోనే యూపీ తొలిస్థానంలో ఉండ‌గా, తెలంగాణ ఐదో స్థానంలో ఉందని తెలిపారు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 913 ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసులు న‌మోద‌య్యాయ‌ని రాందాస్ పేర్కొన్నారు.
Samayam Telugu union minister ramdas athawale comments about resevations
రిజర్వేషన్ల వల్లే అత్యాచారాలు: కేంద్ర మంత్రి!!


అలాగే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కూడా ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయ‌ని కొనియాడారు. కాగా, క‌ర్ణాటకలో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. ఈ హ‌త్య కేసులో బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని ఆయన తెలిపారు. అయితే క్రికెట్‌లోనూ రిజర్వేషన్ల విధానాన్ని పాటించాలని గతంలో ఈయన ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓడిపోవడానికి మ్యాచ్ ఫిక్సింగే కారణమని కూడా ఆరోపించారు. ఈ విషయంలో కోహ్లీ, యువరాజ్‌ల పాత్రపై దర్యాప్తు జరిపించాలని రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.