యాప్నగరం

కోర్టు చెప్పింది మంచిదే.. కానీ ఇవ్వలేకపోతే ఉరేసుకోవాలా? కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్రం చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో లేవన్న విమర్శలపై కేంద్ర మంత్రి సదానంద గౌడ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 13 May 2021, 8:11 pm
కరోనా వ్యాక్సిన్ కొరతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి సదానంద గౌడ. కరోనా వ్యాక్సిన్ కొరతపై వస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కోర్టులు చెప్పినన్ని వ్యాక్సిన్లు ఇవ్వలేకపోతే ఉరేసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన సదానంద షాకింగ్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sadananda gowda


దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోర్టు చెప్పడం మంచిదే.. కానీ రేపు ఇన్ని వ్యాక్సిన్లు ఇవ్వాలని కోర్టు చెబితే.. ఒకవేళ అన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేక ఇవ్వలేకపోతే ఉరేసుకోవాలా? అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయతీగా పనిచేస్తోందని.. అయినా కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని సదానంద అన్నారు. మన పరిధిలో లేని కొన్ని విషయాలు ఉంటాయి.. వాటిని మనం నియంత్రించగలమా అని ఆయన ప్రశ్నించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.