యాప్నగరం

Smriti Irani: దీదీకి మహిళా ప్రత్యర్థి.! బీజేపీ బెంగాల్ ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి

పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి, ఫైర్ బ్రాండ్ నేతను బెంగాల్ బీజేపీ ఇన్‌చార్జిగా నియమించింది.

Samayam Telugu 17 May 2021, 11:34 pm
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినా పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలని చెమటోడ్చిన బీజేపీ ఎన్నికల తర్వాత కూడా బెంగాల్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మహిళా ప్రత్యర్థిని రంగంలోకి దించింది. బెంగాల్ బీజేపీ ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నియమించింది. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడే స్మృతిని బెంగాల్ ఇన్‌చార్జిగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu Smriti Irani
bjp


ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎనిమిది విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బెంగాల్‌లో విస్తృత ప్రచారం నిర్వహించారు. భారీ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. బెంగాల్‌లో దీదీని అధికారం పీఠం కదిలించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

అయినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. మరోమారు దీదీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆమె పోటీ చేసిన నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓటమి పాలవడం ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. పార్టీ ఎక్కువ స్థానాలు సాధించి అధికారంలోకి రావడంతో మమత మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన మమత నైతికంగా అపజయం పాలయ్యారని బీజేపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా నేతను బెంగాల్ ఇన్‌చార్జిగా నియమించడం విశేషం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.