యాప్నగరం

యూపీలో ప్రారంభమైన తొలి దశ పోలింగ్

కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి.

TNN 11 Feb 2017, 7:51 am
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. తొలి దశలో పశ్చిమ యూపీలోని 73 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సుమారు 2 కోట్ల 60 లక్షల 17వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా సమాజ్‌వాదీ, కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీలు పోటీపడుతున్నాయి. మొత్తం 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Samayam Telugu up assembly elections voting for first phase of up polls 2017 begins
యూపీలో ప్రారంభమైన తొలి దశ పోలింగ్


ముఖ్యంగా నోయిడా నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు పంకజ్, బులంద్‌షేహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు రాహుల్ సింగ్ పోటీ పడుతున్నారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ బరిలో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ముజఫర్‌నగర్‌లోని 887 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసారు.

పార్టీల వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు
భారతీయ జనతా పార్టీ - 73
బహుజన్ సమాజ్ పార్టీ - 73
రాష్ట్రీయ లోక్ దళ్ - 57
సమాజ్‌వాదీ పార్టీ -51
కాంగ్రెస్ - 24
ఇతరులు - 179
స్వతంత్రులు - 198

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.