యాప్నగరం

మహాత్ముల జయంతికి ఇకపై సెలవుండదు: యోగి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులు తిరక్కముందే అధికారులను, రాజకీయ నాయకులను పరుగులు పెట్టిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.

TNN 14 Apr 2017, 2:40 pm
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులు తిరక్కముందే అధికారులను, రాజకీయ నాయకులను పరుగులు పెట్టిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. సంచనల నిర్ణయాలను ప్రకటిస్తూ ఆకట్టుకుంటోన్న యోగి నేడు మరో ప్రకటన చేశారు. అంబేడ్కర్ 126 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మహాత్ముల జయంతి సందర్భంగా సెలవు ప్రకటించడాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu up cm announced will cancelled legandary leaders birthday holidays
మహాత్ముల జయంతికి ఇకపై సెలవుండదు: యోగి

గొప్ప వ్యక్తుల ఘన చరిత్రను విద్యార్థులకు పరిచయం చేయాల్సిన రోజున సెలవు తీసుకోవడం సరికాదని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.

ఇక నుంచి మహనీయుల జన్మదినం రోజున పాఠశాలలకు సెలవులు ఉండవని తెలియజేశారు. బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ 126 వ జయంతి వేడుకల్లో యోగి పాల్గొని ప్రసంగించారు. అబ్దుల్ కలామ్ మరణించినప్పుడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తే విమర్శలు చేలరేగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కలామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి ముందుకు సాగాలని కోరారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసి విపక్షాలను సైతం ఆశ్చర్యంలో పడేశారు.

యూపీలోని నిరుపేద ముస్లిం వర్గానికి చెందిన ఆడపిల్లలకు సామూహిక వివాహాలు జరిపించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మైనార్టీ వర్గానికి చెందిన ఆడపిల్లలకు సామూహిక వివాహాలు జరిపించడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మోహిసిన్ రజా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల అభివృద్ధి కార్యక్రమాలలో ఈ సామూహిక వివాహాలని సైతం ఓ భాగం చేశారని ఆయన తెలియజేశారు. .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.