యాప్నగరం

సెలవు ఇవ్వకపోవడం వల్లే ఈ ఘోరం.. బాబు మృతదేహంతో ఆఫీస్‌కు కానిస్టేబుల్

UP Constable Son Death: యూపీకి చెందిన ఓ కానిస్టేబుల్ రెండున్నరేళ్ల వయసున్న తన కుమారుడి మృతదేహాన్ని సీనియర్‌ ఎస్పీ కార్యాలయానికి మోసుకురావడం అలజడి రేపింది. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది. సెలవు ఇవ్వకపోవడంతోనే ఈ ఘోరం జరిగిదంటూ ఆ కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్‌కు వచ్చిన కష్టం ఏంటి? బాబు ఎలా మరణించాడు?

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 15 Jan 2023, 12:41 am
రెండున్నరేళ్ల వయసున్న తన కుమారుడి మృతదేహాన్ని తీసుకొని ఓ కానిస్టేబుల్.. సీనియర్‌ ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటనకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది. సెలవు ఇవ్వకపోవడంతోనే ఈ ఘోరం జరిగిదంటూ ఆ కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu letter
ప్రతీకాత్మక చిత్రం


మథురకు చెందిన సోనూ చౌధరి.. బైద్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. సర్జరీ జరిగిన తన భార్యను, రెండున్నరేళ్ల బాబును చూసుకునేందుకు సెలవు కావాలని జనవరి 7న తన పై అధికారులకు అభ్యర్థన పెట్టుకున్నారు. అయినా, సెలవు మంజూరు కాలేదు. బుధవారం (జనవరి 11) మధ్యాహ్నం ఆయన విధులకు హాజరయ్యారు. అనారోగ్యంతో భార్య ఇంట్లోనే ఉంది. కుమారుడు హర్షిత్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి, ఆడుకొంటూ నీటి గుంతలో పడి మృతి చెందాడు.

కొడుకు మృతదేహంతో కానిస్టేబుల్


ఈ ఘటన కానిస్టేబుల్ సోనూ చౌధరిని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది. తనకు సెలవు ఇవ్వకపోవడం వల్ల ఎంత ఘోరం జరిగిందో చెప్పడానికి సాక్ష్యంగా కుమారుడి మృతదేహంతో ఆయన ఎస్‌ఎస్‌పీ కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.