యాప్నగరం

అన్నం తిన్నాడని కొడుకును కట్టేసి కొట్టిన తండ్రి.. 2 రోజులపాటు శిక్ష

ఆకలితో ఇంట్లో ఉన్న అన్నం మొత్తం తినేసిన కొడుకును యూపీలో ఓ తండ్రి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టాడు. రెండు రోజులు కట్టేసి తిండి పెట్టకుండా శిక్షించాడు.

Samayam Telugu 26 Jun 2020, 11:31 pm
కలి కేకలకు అద్దం పట్టే విషాద ఘటన ఇది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఓ రైతు.. తన కుమారుడితో కనికరం లేని తండ్రిగా ప్రవర్తించాడు. ఆకలి వేసి అడగకుండానే అన్నం తిన్నాడనే కోపంతో కుమారుడిని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. ఇనుప చెయిన్‌తో చెట్టుకు కట్టేసి ఉంచాడు. రెండు రోజులుగా తిండి పెట్టకుండా హింసించి శిక్ష విధించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటన వెనుక కొడుకు నిర్లక్ష వైఖరి కూడా ఉంది.
Samayam Telugu బాధిత యువకుడు
UP Father Beats Son


కౌశాంబి పట్టణంలోని సైనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే కందైలాల్‌ కుటుంబం వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కానీ, కుందైలాల్ కుమారుడు విజయ్‌ మాత్రం ఇవేమీ పట్టకుండా బలాదూర్‌గా తిరుగుతున్నాడు. ఎలాంటి పనిచేయకుండా బయట తిరిగొచ్చి కన్నవాళ్ల ఆగ్రహానికి గురవుతున్నాడు.

ఇటీవల ఇలాగే బయట తిరిగొచ్చిన విజయ్.. ఇంటికి తిరిగి రాగానే ఎవరినీ అడగకుండా వండిన అన్నం మొత్తం తినేశాడు. అసలే ఆర్థిక సమస్యలు, ఆపై జులాయిగా తిరుగుతున్న కుమారుడి చేష్టలు చూసి కందైలాల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపంతో అతడు కన్నకొడుకును ఇనుప గొలుసులతో ఇంటి ముందు చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టాడు. రెండు రోజులుగా అలాగే ఉంచి తిండి పెట్టకుండా శిక్ష వేశాడు.

విషయం ఆ నోటా ఈ నోటా సైనీ పోలీసులకు చేరింది. దీంతో వారు వచ్చి యువకుడు విజయ్‌ను విడిపించారు. చికిత్స కోసం ఆస్పత్రి తరలించారు. తన కుమారుడు విజయ్ ఏ పనిచేయకుండా బలాదూర్‌గా తిరుగడమే కాకుండా.. ఇంట్లో అలజడి సృష్టిస్తున్నందునే అలాంటి శిక్ష వేశానని తండ్రి కందైలాల్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. తన కుమారుడు అన్నం తిన్నందుకు బాధ లేదని.. ఇంట్లో వాళ్లకు లేకుండా తినడం వల్ల వాళ్లంతా కడుపు మాడ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: ఏడాదిలోగా కరోనా వ్యాక్సిన్.. అందరికీ అందడం సవాలే: WHO

Must Read: కత్తితో దుండగుడి బీభత్సం.. ముగ్గురి మృతి, ఉగ్రవాద దాడేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.