యాప్నగరం

చీపురు పట్టి ఆఫీసంతా ఊడ్చేసిన మంత్రి

ఉత్తర్ ప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ దారిలోనే ఆయన సహచరులు నడుస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని...

Samayam Telugu 23 Mar 2017, 1:49 pm
ఉత్తర్ ప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ దారిలోనే ఆయన సహచరులు నడుస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని...విధి నిర్వహణలో ఎవ్వరూ గుట్కాలు, పాన్ మసాలాలు నమలరాదని యోగి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఏడాదికి వంద గంటలపాటు పనిచేసే ఆఫీసులు, ఇతర పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని మంత్రులకు కూడా సూచించారు.
Samayam Telugu up minister sweeps his office with broom
చీపురు పట్టి ఆఫీసంతా ఊడ్చేసిన మంత్రి


సీఎం ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించే పనిలో పడ్డారు మంత్రులు. ఇందులో భాగంగానే మంత్రి ఉపేంద్ర తివారీ చీపురు పట్టారు. తన ఆఫీసును ఆయనే శుభ్రం చేశారు. ఆఫీసంతా చెత్తాచెదారం ఉండటంతో ఆయన ఈ పని చేశారు. అంతేకాదు ఆఫీసు బయట కారిడార్ లో ఉన్న చెత్తను కూడా చీపురుతో ఊడ్చేశారు.

మంత్రి ‘పరిశుభ్రత’పై ప్రాక్టికల్ క్లాసును అధికారులు, సిబ్బంది చూసి అవాక్కయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.