యాప్నగరం

కాంగ్రెస్‌కు 99 సీట్లు ఆఫర్ చేసిన అఖిలేశ్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమతో జతకడితే కాంగ్రెస్‌కు 99 సీట్లు కేటాయిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు.

TNN 21 Jan 2017, 7:36 pm
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమతో జతకడితే కాంగ్రెస్‌కు 99 సీట్లు కేటాయిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. లక్నోలో శనివారం కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్‌, ప్రియాంక గాంధీతో సమావేశమైన అఖిలేశ్.. అనంతరం ఈ ప్రకటన చేసారు. అయితే అఖిలేశ్ ఆఫర్‌ను కాంగ్రెస్ స్వీకరించిందా.. లేదా.. అనే విషయంపై ఇంకా అధికార ప్రకటన ఏమీ వెలువడలేదు.
Samayam Telugu up polls samajwadi party chief akhilesh yadav offers 99 seats to congress
కాంగ్రెస్‌కు 99 సీట్లు ఆఫర్ చేసిన అఖిలేశ్


అయితే ఎస్పీ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌‌తో పొత్తు లేనట్లే. కాంగ్రెస్‌కు యూపీ సీఎం 100 సీట్లు కేటాయించారు. కానీ వారు 120 కన్నా తక్కువ సీట్లను స్వీకరించడానికి సిద్ధంగా లేమని చెప్పారు’ అని అన్నారు. మరోవైపు కాంగ్రెస్-ఎస్పీ పొత్తు ఇంకా చర్చల దశలోనే ఉందని ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ వెల్లడించారు.

ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుపై ఆదివారం ఉదయానికి స్పష్టత వస్తుందని గులాం నబీ ఆజాద్ చెప్పారు. కాగా, ఇప్పటికే అఖిలేశ్ యూపీ ఎన్నికల కోసం 210 మందితో ఎస్పీ జాబితాను శుక్రవారం విడుదల చేసారు. దీంతో రేపటి ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు ప్రకటనపై యూపీలో ఆసక్తి నెలకొంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ కురువృద్ధుడు, అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుకు సుముఖంగా లేరని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.