యాప్నగరం

పెరుగుతున్న మంచు చిరుతలు.. చిగురిస్తోన్న ఆశలు

అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్న మంచు చిరుతలు.. హిమాలయాల్లోని కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీలో తారసపడటం జంతు ప్రేమికులకు ఆనందం కలిగిస్తోంది.

TNN 12 Mar 2018, 5:22 pm
గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని భూమ్మీద జంతు జాలం వేగంగా అంతరించి పోతోంది. అభివృద్ధి పేరిట కాలుష్యం పెరిగే కొద్దీ అరుదైన జీవజాలం కనుమరుగవుతోంది. ఇప్పటికే వేలాది జీవజాతులు అంతరించిపోగా.. మరికొన్ని ఆ ముప్పును ఎదుర్కొంటున్నాయి. హిమాలయాల్లో ఉండే మంచు చిరుతలు కూడా ఇదే కోవకు చెందుతాయి. ప్రపంచవ్యాప్తంగా మంచు చిరుతల సంఖ్య పదివేల లోపే. రానున్న 23 ఏళ్లలో వీటి సంతతి పది శాతం తగ్గుతుందని అంచనా. హిమాచల్ ప్రదేశ్‌లో కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీలో ప్రస్తుతం 25 నుంచి 30 వరకు మంచు చిరుతలు ఉన్నాయి. దీంతో వీటిని కాపాడుకోవడానికి ప్రభుత్వం శక్తి మేర ప్రయత్నిస్తోంది.
Samayam Telugu up to 30 snow leopards in kibber wildlife sanctuary of spiti
పెరుగుతున్న మంచు చిరుతలు.. చిగురిస్తోన్న ఆశలు


కొద్ది కాలం క్రితం వరకూ స్పిటీ వ్యాలీలో మంచు చిరుతలు అరుదుగా కనిపించేవి. ఒకానొక దశలో వీటి జాడ లేకపోవడంతో.. అవి అంతరించి పోయాయని భావించారు. కానీ హిమగిరుల్లో అమర్చిన కెమెరాల్లో వీటి కదలికలు లభ్యమయ్యాయి.

మంచు చిరుత పిల్లలు కూడా కనిపించడాన్ని బట్టి వీటి సంతతి పెరుగుతోందని భావించొచ్చని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. నేషనల్ కన్జర్వేషన్ ఫౌండేషన్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సౌత్ జోన్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ కే కప్టా తెలిపారు.


మంచు చిరుతల జనాభాను లెక్కించడానికి అటవీ శాఖ నేషనల్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయో తేల్చడం కోసం వచ్చే మూడేళ్లలో ఈ ఫౌండేషన్ శాస్త్రీయంగా సర్వే చేపట్టనుంది.

వాటి జనాభాతోపాటు ఒక్కో జంతువుకు ఎంత స్థలం అవసరం, వాటి లింగనిష్పతి, వయసు.. మనుషులు, ప్రకృతి నుంచి వాటికి పొంచి ఉన్న ముప్పు తదితర అంశాలను నేషనల్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌ వెల్లడించనుంది.

To Read This Story in English Click Here

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.