యాప్నగరం

దేశ చరిత్రలోని కీలకమైన 15 కేసుల్లో అదే జరిగింది

బోఫోర్స్, రాజీవ్ గాంధీ హత్య, బాబ్రీ మసీదు, సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్, బెస్ట్ బేకరి, బొగ్గు కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కేసులతో పాటు బి.సి.సి.ఐ తలరాతను మార్చిన కేసుల్లో అప్పటి ప్రధాన న్యాయముర్తులు ఇష్టానుసారం వ్యవహరించినట్లు తేలిపోయింది.

TNN 15 Jan 2018, 1:12 pm
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తి దీపక్ మిశ్రా కేసుల కేటాయింపుల్లో అసంబద్ధంగా వ్యవహరిస్తున్నారని కీలక, సంచలనాత్మక, సున్నితమైన కేసుల కేటాయింపుల్లో సీనియారిటీని కాదని ఉద్దేశ్యపూర్వకంగా జూనియర్ జడ్జీలతో కూడిన బెంచ్లకు అప్పగిస్తున్నారంటూ జస్టిస్ చలమేశ్వర్ రావుతో పాటు మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రచ్చ కెక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు అవాంఛనీయమని, న్యాయవ్యవస్థకు మంచిది కాదని ప్రముఖ న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో వైపు ఇది సుప్రీంకోర్టు అంతర్గత వ్యవహారమని తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులపై " టైమ్స్ ఆఫ్ ఇండియా" దృష్టి సారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నలుగురు న్యాయముర్తులు ఆరోపిస్తున్నట్లుగా గత రెండు దశాబ్దాల్లో దేశ చరిత్రను మార్చిన అతి కీలక, సంచలనాత్మక, సున్నితమైన కేసుల విషయంలో ఆ నలుగురు జడ్జీలు చెప్పిందే నిజమని తేలింది.
Samayam Telugu uper sensitive cases being given to junior sc judges for last 20 years
దేశ చరిత్రలోని కీలకమైన 15 కేసుల్లో అదే జరిగింది


గత ఇరవై ఏళ్లలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 15 కేసులపై " టైమ్స్ ఆఫ్ ఇండియా" ఆరా తీయగా ఆందోళనకు గురి చేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోఫోర్స్, రాజీవ్ గాంధీ హత్య, బాబ్రీ మసీదు, సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్, బెస్ట్ బేకరి, బొగ్గు కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కేసులతో పాటు బి.సి.సి.ఐ తలరాతను మార్చిన కేసుల్లో అప్పటి ప్రధాన న్యాయముర్తులు ఇష్టానుసారం వ్యవహరించినట్లు తేలిపోయింది. ఇలాంటి కీలక కేసుల్లో సంప్రదాయాలను పక్కన పెట్టి కేసుల బదలాయింపులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. రాజ్యాంగ ధర్మాసనాన్ని కాదని వేరే కీలక కేసులను జూనియర్ న్యాయమూర్తులతో కూడిన బెంచ్లకు అప్పగించినట్లు వెల్లడైంది. అత్యంత కీలకమైన ఈ కీలకమైన 15 కేసుల్లో అప్పటి ప్రధాన న్యాయముర్తులు సీనియారిటీలో తమ తర్వాతి స్థానంలో ఉన్న నలుగురు జడ్జీలను కాకుండా జూనియర్లతో కూడిన సెలెక్టివ్ బెంచ్ లకు అప్పగించనట్లు తేటతెల్లమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లబ్ది చేకూర్చేందుకు, అనుకూలంగా తీర్పులు వచ్చేలా చేసేందుకే అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తనకు సన్నిహితంగా ఉండే న్యాయమూర్తులతో కూడిన బెంచ్లకు కేసులు అప్పగిస్తున్నారని అందుకే సీనియారిటీని పాటించడం లేదని పలు వర్గాల నుంచి ఆరోపణలు వెల్లవెత్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.