యాప్నగరం

వాహనం నడుపుతూ ఫోన్ వాడటం ప్రమాదమని తెలిసినా...

వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటార‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. అయితే, ఈ సూచనలను అనుసరించేవారు ఎందరు? ప్రమాదం జ‌రుగుతుంద‌ని తెలిసినా చాలా మంది పట్టించుకోరు.

TNN 28 Apr 2017, 10:10 pm
వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటార‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. అయితే, ఈ సూచనలను అనుసరించేవారు ఎందరు? ప్రమాదం జ‌రుగుతుంద‌ని తెలిసినా చాలా మంది పట్టించుకోరు. డ్రైవింగ్‌ సమయంలో చేతిలో ఫోన్‌‌తోనే చాలా మంది క‌నబడతారు. దీని వల్ల వాహ‌న‌ చోదకులు ప్రమాదాల బారినపడి తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కోల్పోడం లాంటివి నిత్యం చూస్తూనే ఉంటాం. ఇంత జరిగినా ద్విచక్ర వాహనదారులు మాత్రం త‌మ తీరు మార్చుకోరు. ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదమని తెలిసినా సగం మంది దాన్ని మార్చుకోవడం లేదు. ఈ విషయాలు తాజాగా ఓ సర్వేలో వెల్లడయ్యాయి.
Samayam Telugu using mobile phones while driving is dangerous but half of us use it anyway
వాహనం నడుపుతూ ఫోన్ వాడటం ప్రమాదమని తెలిసినా...


కంతార్‌ పబ్లిక్‌, సేవ్‌ లైఫ్‌ అనే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, ముంబయి, జైపూర్‌, బెంగళూరు నగరాల్లోని ద్విచక్ర, ఆటో, కారు, లారీ లేదా బస్సు చోదకుల అభిప్రాయాలను సేకరించి నివేదికను రూపొందించారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 1749 మందిని ప్ర‌శ్నించారు. వారిలో 47 శాతం మంది తాము ప్రయాణం చేస్తూనే ఫోన్‌ మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. తాము ఫోన్లో మాట్లాడుతూ ఒక్కోసారి సడెన్‌‌గా‌ బ్రేక్ కూడా వేస్తుంటామని 34 శాతం మంది తెలిపారు.
పనికి సంబంధించిన విషయాలు మాట్లాడతామని 41 శాతం మంది పేర్కొంటే, కాల్ వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతంలో నిలపమని 60 శాతం మంది తెలిపారు.

వాహనం నడిపేటప్పుడు మొబైల్ వినియోగించడం వల్ల ప్రమాదాలకు గురయ్యామ‌ని, త్రుటిలో తప్పించుకున్నామ‌ని 20 శాతం మంది తెలియజేశారు. వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వాడ‌కూడ‌ద‌నే విష‌యాన్ని 96 శాతం మంది అంగీకరించారు. భారత్‌లో మొబైల్ వినియోగిస్తూ పరధ్యానంగా వాహనం నడిపే వారి సరళి, ప్రవర్తన అధ్యయనం పేరుతో నిర్వహించిన ఈ సర్వే నివేదికను వోడాఫోన్ ఇండియా విదేశీ వ్యవహారాలు, రెగ్యులేటరీ అండ్ సీఎస్ఆర్ డైరెక్టర్ పి బాలాజీ, సేవ్‌లైఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ (ఆపరేషన్స్) సాజీ చెరియన్ విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.