యాప్నగరం

యూపీ: గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ ఎమ్మెల్యే

అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే గుండెపోటుతో హఠన్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన గురువారం గుండెపోటుకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

Samayam Telugu 21 Aug 2020, 1:38 pm
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జనమేజయ సింగ్ (75) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. డియోరియా జిల్లా సదర్‌‌కు ఎమ్మెల్యే జనమేజయ సింగ్ లక్నోలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు పేస్‌మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో మృతి చెందినట్టు లోహియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యే జనమేజయ సింగ్‌‌ గురువారం సాయంత్రం గుండెపోటుకు గురికావడంతో.. తొలుత సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్‌కు తరలించారు.
Samayam Telugu బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి


జనమేజయ మృతిపై ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతగానో శ్రమించారని కొనియాడారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆయన ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని, ఎంతో అంకితభావంతో పనిచేశారన్నారు. ప్రజలకు నిజమైన శ్రేయోభిలాషిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

డియోరియా శాసనసభ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు జనమేజయ సింగ్ గెలుపొందారు. 2012 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రమోద్ సింగ్‌పై 23వేలకుపైగా ఓట్లతో విజయం సాధించిన ఆయన.. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి జైశాల్వ్‌పై 46వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేకు భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.