యాప్నగరం

Police Nagin Dance: స్వతంత్ర దినోత్సవం రోజున పోలీసుల నాగిని డ్యాన్స్..!

ఉత్తరప్రదేశ్ (Police Nagin Dance) పోలీసులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పోలీసులు నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. స్వతంత్ర దినోత్సవం రోజున పోలీసులు అలా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. పురాన్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌ ప్రాంగణంలో పోలీసులు యూనిఫాంలో డ్యాన్స్ చేశారు. అయితే డ్యాన్స్ చేసిన పోలీసులను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అలాగే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని.. వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 17 Aug 2022, 2:05 pm
Police Nagin Dance: దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్ ఆఫీసుల్లో ఇలా ప్రతిచోట వైభవంగా వేడుకలు జరిగాయి. ప్రతి వీధిలో, వాడలో మువ్వెన్నల జెండా ఎగిరింది. జెండా వందనాలతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆరోజు ఉత్సాహంగా సాగిపోయింది. ఆ రోజున పోలీసులు కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులకు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో బయటకొచ్చింది.
Samayam Telugu Police Nagin Dance in UP


స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనందంతో గడిపిన పోలీసులు అంతే ఉత్సాహంతో డ్యాన్స్‌లు కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోనే తెగ చక్కర్లు కొడుతుంది. ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్‌లో పురాన్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌ ప్రాంగణంలో పోలీసులు ఎంజాయ్ చేశారు. ఎటువంటి బెరుకు లేకుండా యూనిఫాంతోనే నాగిని డ్యాన్స్ చేశారు. నిజానికి ఇలా యూనిఫాంలో డ్యాన్స్ వేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అలా చేస్తే పోలీస్ డ్రెస్‌కే అవమానంగా భావిస్తారు.


అయితే పోలీసుల డ్యాన్స్‌ను నెటిజన్లు ఇష్టపడుతున్నారు. పైగా డ్యాన్స్ చేసి సంతోషంగా గడిపిన పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే విషయంలో పురాన్‌పూర్ పోలీసు సిబ్బంది వీరేంద్ర విక్రమ్ స్పందించారు. పోలీసుల డ్యాన్స్ వీడియోపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


అయితే గతంలో ఓ ముగ్గురు పోలీసులు డ్యాన్స్ చేసే సస్పెండ్ అయ్యారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ముగ్గురు పోలీసులు కారులో వెళ్తూ డ్యాన్స్ చేసి.. ఎంజాయ్ చేశారు. అయితే ఆ వీడియో వైరల్ అయింది. దాంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అదో పెద్ద ఇష్యూ అయింది. కారులో పోలీస్ డ్రెస్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా కారులో డ్యాన్స్ వేయడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డ్రెస్ వేసుకుని సరిగ్గా ప్ర‌వ‌ర్తించ‌నందుకు. అది పోలీస్ డ్రెస్‌కు అవ‌మానం అని భావించి.. పోలీస్ వాళ్ల‌ను స‌స్పెండ్ చేశారు.

Read Also:పదునైన కత్తులతో స్కూల్ బస్సుపై దాడి... వాహనంలో 35 మంది చిన్నారులు
Read Also:స్కూల్లో మత్తు పానియాలు సేవించి పార్టీ చేసుకున్న పెద్ద మనుషులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.