యాప్నగరం

ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన పోలింగ్

ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి బుధవారం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 69

Samayam Telugu 15 Feb 2017, 8:01 am
ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి బుధవారం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 69 స్థానాలకు ఒకేదశలో (బుధవారం) పోలింగ్ జరుగుతోంది. కర్ణప్రయాగ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుల్దీప్ సింగ్ కన్వాసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా..ఆ ఒక్కస్థానానికి ఎన్నిక వాయిదా వేశారు. ఈ నియోజకవర్గానికి మార్చి 9న పోలింగ్ జరుగనుంది.
Samayam Telugu uttarakhand polling today while up casts second phase
ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన పోలింగ్


బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఓటు వేయగానే ధృవీకరించే ఓటర్ వెరిఫైడ్ పేపటర్ ఆడిట్ ట్రయల్-వీవీపీఏటీ యంత్రాలను తొలిసారిగా ఉత్తరాఖండ్ లో అందుబాటులోకి తెచ్చారు.

అటు ఉత్తర్ ప్రదేశ్ లో రెండు దశ పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల పరిధిలో ఉన్న 67 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. 720 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.28కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.