యాప్నగరం

కర్ణాటక గవర్నర్‌ మరో వివాదాస్పద నిర్ణయం.. సుప్రీంలో కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్!

బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ.. బుధవారం (మే 16) వివాదాస్పద నిర్ణయం తీసుకున్న గవర్నరు.. మరోసారి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షకు ముందే గవర్నరు వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్‌ చేయడం ఇప్పుడు మరో వివాదానికి కారణమైంది.

TNN 17 May 2018, 10:04 pm
కర్ణాటక రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ.. బుధవారం (మే 16) వివాదాస్పద నిర్ణయం తీసుకున్న గవర్నరు.. మరోసారి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షకు ముందే గవర్నరు వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్‌ చేయడం ఇప్పుడు మరో వివాదానికి కారణమైంది. గవర్నరు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, బలపరీక్ష పూర్తయ్యే వరకు అది చెల్లకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీంకోర్టులో సంయుక్త పిటిషన్‌ దాఖలు చేశాయి.
Samayam Telugu VAJUBHAI VALA


గవర్నరు ఆహ్వానం మేరకు గురువారం (మే 17) ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణ కోసం గవర్నరు ఆయనకు 15 రోజులు గడువు ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు బుధవారం (మే 16) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గవర్నరు విచక్షణ అధికారాలను ప్రశ్నించలేమని, ఈ విషయంలో స్టే ఇవ్వడం కుదరదంటూ.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రెండు పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారమే (మే 18) విచారణ చేపట్టనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.