యాప్నగరం

బెంగళూరులో రసాయన ‘హిమపాతం’!

వేసవి వేడితో ఉడికిపోతున్న బెంగళూరు వాసులకు భారీ వర్షాలు ఉపసమనం కలిగించాయి.

TNN 29 May 2017, 11:25 am
వేసవి వేడితో ఉడికిపోతున్న బెంగళూరు వాసులకు భారీ వర్షాలు ఉపసమనం కలిగించాయి. అయితే వర్షాల కారణంగా తలెత్తిన మరో సమస్య వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అదే రసాయన ‘హిమపాతం’. హిమపాతం తెలుసు.. ఈ రసాయన హిమపాతం ఏంటి..? అనుకుంటున్నారా! అయితే ఇది చదవండి..
Samayam Telugu varthur lake after heavy rain chemical snowfall in bengaluru
బెంగళూరులో రసాయన ‘హిమపాతం’!


బెంగళూరులో ఐటీ ప్రాంతమైన వైట్ ఫీల్డ్‌కు సమీపంలో వర్తూర్ సరస్సు ఉంది. ఇది విషవలయంగా మారింది. పరిశ్రమల వ్యర్థాలు, చెత్త చెదారం యథేచ్చగా ఈ సరస్సులో వేయడంతో ఇది పూర్తిగా కలుషితం అయిపోయింది. సరస్సు నిండా ఎప్పుడూ టాక్సిక్ నురగ దర్శనమిస్తోంది. అయితే గత వారం నగరంలో కురిసిన భారీ వర్షాలకు సరస్సు నిండు కుండలా మారింది. దీంతో కలుషితాల నురగ మరింత ఎక్కువైంది. ఇప్పుడు ఆ నురగ గాలికి ఎగురుతూ వైట్ ఫీల్డ్ రోడ్లపైకి వచ్చేస్తోంది. శని, ఆదివారాల్లో ఇది హిమపాతాన్ని తలపించింది.

ఈ రసాయన హిమపాతంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలులు బాగా వీస్తుండటంతో నురగ ఎగురుకుంటూ జనాలపై పడుతోంది. దీంతో బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) రంగంలోకి దిగింది. బీడీఏ కమిషనర్ రాకేష్ సింగ్ వార్తూర్ సరస్సును పరిశీలించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.

కాగా, విష వ్యర్థాల నుంచి నగరంలోని సరస్సులను కాపాడటంలో అధికారులు విఫలమయ్యారంటూ విమర్శలు వినిపిస్తు్న్నాయి. వార్తూర్‌తో పాటు సుబ్రమణ్యపుర సరస్సు కూడా కలుషితమైపోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే నగరం విష వలయంలో చిక్కకుపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.