యాప్నగరం

VD Savarkar మహారాష్ట్రతో సరిహద్దు వివాదం: కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ చిత్రపటం.. కాంగ్రెస్ నిరసన

VD Savarkar వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాధం నేపథ్యంలో.. ఈసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా సాగుతోంది. తాజాగా, వీడీ సావర్కర్ అంశాన్ని తలకు ఎత్తుకుంటోంది. ప్రభుత్వ అవినీతిపై చర్చ నుంచి తప్పించుకోడానే అసెంబ్లీలో సావర్కర్‌ ఫోటోను ఏర్పాటు చేసి కొత్త వివాదానికి తెర తీసిందని కాంగ్రెస్‌ నేతలు దుయ్యబడుతున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 19 Dec 2022, 1:10 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు
  • సావర్కర్ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ
  • మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఆందోళనలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu VD Savarkar
VD Savarkar కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకూ రాజుకుంటోంది. ఈ సమయంలో కర్ణాటక అసెంబ్లీలో వీడీ సావర్కర్‌ చిత్రపటాన్ని అధికార బీజేపీ ఆవిష్కరించింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. సావర్కర్‌ చిత్రపటాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు, అసెంబ్లీలో వాల్మీకి, బసవన్న, కనకదాస, బీఆర్‌ అంబేడ్కర్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లాంటి మహనీయులను చిత్రపటాలను కూడా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు.
ప్రభుత్వ అవినీతిపై చర్చ నుంచి తప్పించుకోడానే అసెంబ్లీలో సావర్కర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వివాదం రాజేసిందని కాంగ్రెస్‌ నేతలు దుయ్యబడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. వీర్ సావర్కర్ చిత్రపటాన్ని వ్యూహాత్మకంగానే బీజేపీ ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. వీర్ సావర్కర్ గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా హిందూత్వ సిద్ధాంతకర్త చిత్రపటాన్ని ఆవిష్కరించడం ద్వారా మరో అడుగు ముందుకు వేసింది.

పొరుగున మహారాష్ట్రకు చెందిన వీర్ సావర్కర్‌కు బెలగావితోనూ అనుబంధం ఉంది. నాలుగు నెలల పాటు 1950లో బెలగావీలోని హిండల్గా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ముంబయిలో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఆయన బెలగావీకి వచ్చేయగా.. అక్కడ పోలీసులకు చిక్కారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని లియాఖత్ అలీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలపడానికి సిద్ధమైన సావర్కర్‌ను ముందస్తు అరెస్ట్ చేశారు. సావర్కర్ కుటుంబసభ్యులు కోర్టులో పిటిషన్ వేయడం... రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని ఆయన బాంబే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో న్యాయస్థానం విడుదలకు ఉత్తర్వులు జారీచేసింది.

శీతకాల అసెంబ్లీ సమావేశాల చివరి విడతను బెళగావీలో నిర్వహించనున్నారు. పది రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అటు, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ధైర్యశీల్ మానేను బెలగావీలోకి రాకుండా కర్ణాటక అధికారులు నిషేధం విధించారు.


Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.