యాప్నగరం

వెంకయ్య నాయుడే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ఉపరాష్ట్రపతి పదవి కోసం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా...

TNN 18 Jul 2017, 9:53 am
ఉపరాష్ట్రపతి పదవి కోసం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ముందంజలో వున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దక్షిణాదిన తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న కారణంగానే వెంకయ్య నాయుడుని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలుస్తోంది.
Samayam Telugu venkaiah naidu was named as ndas vice presidential candidate
వెంకయ్య నాయుడే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి


ఆగస్టు 5న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనదల్చిన అభ్యర్థులు జులై 18వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాల్సి వుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రేపు ఉదయం 11 గంటలకి వెంకయ్య నాయుడు తన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఇప్పటికే ఎన్డీఏ తరపున రాష్ట్రపతి పదవి కోసం బరిలో నిలిచిన రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి వెంకయ్య నాయుడు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి పదవి కోసం 18 పార్టీల మద్దతు కలిగిన ప్రతిపక్షకూటమి గోపాలకృష్ణ గాంధీని తమ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.