యాప్నగరం

మోడీ, జగన్ భేటీ పై వెంకయ్య స్పందన

కొందరు మోడీ, జగన్ ల సమావేశం పట్ల అతిగా ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదని

TNN 20 May 2017, 2:04 pm
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మోడీతో జగన్ భేటీని అధికార తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. తనపై నమోదైన కేసులను ఎత్తేయించుకోవడానికే మోడీతో జగన్ సమావేశం అయ్యాడని తెలుగుదేశం పార్టీ విమర్శనాస్త్రాలను సంధించింది. అలాగే కొన్ని మీడియా వర్గాలు ఈ సమావేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు రాశాయి. ఆ తర్వాత ఏపీ బీజేపీ నేతలుకొందరు స్పందిస్తూ ... ప్రధానితో జగన్ సమావేశం కావడాన్ని తప్పుపట్టనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
Samayam Telugu venkaiah on modi jagans meeting
మోడీ, జగన్ భేటీ పై వెంకయ్య స్పందన


ఆ పరిణామాల మధ్య మౌనంగానే ఉండిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు స్పందించారు. ప్రధానితో జగన్ సమావేశంలో తప్పు లేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత ప్రధానిని కలిస్తే తర్జన భర్జనలు ఎందుకు? అని వెంకయ్య ప్రశ్నించారు. రాజకీయ పరిపక్వత లేని వాళ్లే ఆ సమావేశాన్ని తప్పు పడుతున్నారని వెంకయ్య తేల్చేశారు.

కొందరు మోడీ, జగన్ ల సమావేశం పట్ల అతిగా ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదని, పరోక్షంగా తెలుగుదేశం నేతల తీరును వెంకయ్య ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల ఊహాగానాలపై స్పందిస్తూ.. దానికి ఇంకా సమయం ఉందని అన్నారు. ఎన్నికలు ఇంకా రేండేళ్లకు అని గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.