యాప్నగరం

‘లోకల్ సభ’నూ మాకే అప్పగించండి!

2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని..ఇప్పుడు కూడా లోకల్ సభ

Samayam Telugu 3 Feb 2017, 12:41 pm
2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని..ఇప్పుడు కూడా లోకల్ సభ (అసెంబ్లీ) ఎన్నికల్లోనూ అదే సపోర్టుతో బీజేపీని గెలిపించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.
Samayam Telugu venkaiah urges up voters to give local sabha for bjp
‘లోకల్ సభ’నూ మాకే అప్పగించండి!


‘‘మీరు లోక్ సభ ఎన్నికల్లో మా వెంటే ఉన్నారు. ఇప్పుడు దేశం, రాష్ట్రం కలికట్టుగా అభివృద్ధి చెందాలంటే లోకల్ సభ ఎన్నికల్లో మీ మద్దతు కావాలి’’ అని వెంకయ్య కోరారు.
కేంద్ర,రాష్ట్రాల్లో ఒకేపార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవెలప్ మెంట్ బ్యాంక్ వంటివి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని వెంకయ్య గుర్తు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని..ప్రజలంతా కమలం గుర్తుకు ఓటేయాలని వెంకయ్య కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.