యాప్నగరం

ప్రముఖ రచయిత, జర్నలిస్టు అరుణ్ సాధు కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు, ప్రఖ్యాత రచయిత అరుణ్ సాధు (76) కన్నుమూశారు. ఇటీవలే గుండెపోటుకు గురై ముంబైలోని సియాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాధు.. సోమవారం (సెప్టెంబర్ 25) ఉదయం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. జర్నలిస్టుగా మంచి గుర్తింపు పొందిన సాధు.. అదే సమయంలో రచయితగానూ తనదైన ముద్ర వేశారు.

TNN 25 Sep 2017, 1:34 pm
సీనియర్ జర్నలిస్టు, ప్రఖ్యాత రచయిత అరుణ్ సాధు (76) కన్నుమూశారు. ఇటీవలే గుండెపోటుకు గురై ముంబైలోని సియాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాధు.. సోమవారం (సెప్టెంబర్ 25) ఉదయం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. జర్నలిస్టుగా మంచి గుర్తింపు పొందిన సాధు.. అదే సమయంలో రచయితగానూ తనదైన ముద్ర వేశారు. పలు ఆంగ్ల దినపత్రికల్లో సుదీర్ఘకాలం పాత్రికేయుడిగా పని చేసిన ఆయన హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో అనేక నవలలు రాశారు.
Samayam Telugu veteran journalist writer arun sadhu passes away in mumbai
ప్రముఖ రచయిత, జర్నలిస్టు అరుణ్ సాధు కన్నుమూత


ప్రెస్ జర్నల్‌కు ఎడిటర్‌గానూ సాధు పనిచేశారు. మరాఠీ భాషలో ఆయన రాసిన ‘సింహాసన్’, ‘ముంబై దినాంక్’ నవలలు మంచి గుర్తింపు పొందాయి. 1970లో మరాఠీలో వచ్చిన ‘సింహాసన్’ సినిమా ఈ నవలల ఆధారంగానే తెరకెక్కింది. ముఖ్యమంత్రి పదవి చుట్టూ తిరిగే రాజకీయ, క్రిమినల్ డ్రామా నేపథ్యంలో కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.

2000 సంవత్సరంలో వచ్చిన ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ సినిమాకు సూని తారాపోరేవాలా, దయా పవార్‌తో కలిసి అరుణ్ సాధు స్క్రిప్ట్ అందించారు. ఇది ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా 9 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఈ సినిమాకు మమ్ముట్టి.. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
వివిధ పత్రికల్లో సుదీర్ఘ కాలం పలు హోదాల్లో పాత్రికేయుడిగా పని చేసిన సాధు.. పుణే యూనివర్సిటీలో ఆరేళ్ల పాటు ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. వర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్‌కు హెచ్‌వోడీగా పనిచేశారు. సాహిత్య అకాడమీ పురస్కారం, భారతీయ భాషా పరిషత్‌, ఎన్‌సీ కేల్కర్‌, మరాఠీ సాహిత్య సమ్మేళన్‌తో పాటు పలు అవార్డులు ఆయణ్ని వరించాయి.

అరుణ్ సాధు ప్రముఖ రచనలు:
మహారాష్ట్ర (ఇంగ్లిష్), కాకాసాహెబ్ గాడ్గిల్ (ఇంగ్లిష్), ఫిడేల్ (చే ఆణీ క్రాంతి), ముఖ్‌వటా, పద్ఘమ్, శోధ్‌యాత్రా, బహిష్కృత్, త్రిశంకూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.